Zee Telugu Mahasangamam Episodes. జీ తెలుగు తన ప్రసారాలను ప్రారంభించినప్పటి నుంచి పలు వినోదాత్మక, ఆలోచలను రేకెత్తించే
By Medi Samrat Published on 2 May 2022 12:30 PM GMT
జీ తెలుగు తన ప్రసారాలను ప్రారంభించినప్పటి నుంచి పలు వినోదాత్మక, ఆలోచలను రేకెత్తించే కార్యక్రమాలను ప్రసారం చేసింది. ఛానల్‌లో ప్రస్తుతం ప్రసారమవుతున్న ప్రైమ్ టైమ్ ఫిక్షన్ షోలు 'ప్రేమ ఎంత మధురం', 'త్రినయని' పూర్తిగా విభిన్నమైన కల్ట్ ఫాలోయింగ్‌ను దక్కించుకున్నాయి. ఈ సీరియల్స్‌తో ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం జీ తెలుగు మహా సంగమం ఎపిసోడ్ లను ప్లాన్ చేసింది.
మే 2, 3వ తేదీలలో రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు 'ప్రేమ ఎంత మధురం', 'త్రినయని'ల రెండు మహాసంగమం ఎపిసోడ్‌లను ప్రసారం చేసేందుకు ఛానెల్ సిద్ధంగా ఉంది. ఈ రెండు ఎపిసోడ్లు మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులు టెలివిజన్ స్ర్కీన్‌పై నుంచి చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తాయనడంలో సందేహమే లేదు.
మహాసంగమం ఎపిసోడ్‌లో.. బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డును అందుకునే ముందు ఆర్య కొంత ఇబ్బంది పడుతూ ఉండడాన్ని నయని గమనించడం మనం చూస్తాము. అతన్ని రక్షించేందుకు ఆమె తన శక్తి వంచనలేకుండా ప్రయత్నిస్తుంది. విశాల్, నయని ఇద్దరూ ఆర్యకు సహాయం చేయగలరా లేదా అని తెలుసుకునే క్రమంలో ప్రేక్షకులు ఉత్కంఠకు గురవుతారు. 'ప్రేమ ఎంత మధురం', 'త్రినయని'ల మహాసంగమం ఎపిసోడ్లలో ఉత్కంఠభరితమైన డ్రామాను చూసేందుకు మే 2, 3 తేదీలలో రాత్రి 8.30- 9.30 గంటల వరకు జీ తెలుగు ఛానెల్‌ను ట్యూన్ చేయండి.