సత్యదేవ్ నటించిన 'జీబ్రా' సినిమా నవంబర్‌లో విడుదలై మంచి మౌత్ టాక్ అందుకుంది. కానీ తక్కువ ప్రీ-రిలీజ్ హైప్, బజ్ కారణంగా, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ వెంచర్‌గా ముగిసింది. ఈ సినిమా ఇక OTT లో సందడి చేయడానికి సిద్ధమైంది.
జీబ్రా డిజిటల్ హక్కులు ఆహా వీడియో తీసుకుంది. తెలుగు, తమిళం రెండు భాషలలో స్ట్రీమింగ్ హక్కులు ఆహా దగ్గర ఉన్నాయి. డిసెంబర్ 20 నుండి స్ట్రీమింగ్ అవ్వనుంది. థియేటర్లలో సినిమా చూడటం మిస్ అయిన చాలా మంది ప్రేక్షకులు ఇప్పుడు OTT లో ఈ సినిమాను ఎంజాయ్ చేయొచ్చు. ఒకటే రోజు జీబ్రాతో పాటు మెకానిక్ రాకీ, దేవకి నందన వాసుదేవ అనే మరో రెండు సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఈ సినిమాలు పెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి.