పవన్ కళ్యాణ్ సినిమాకు పని చేయాలని అనుకుంటున్నారా.. ఇది తెలుసుకోండి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాను చూడాలంటేనే ఎగిరి గంతేస్తాం. అలాంటిది పవన్ కళ్యాణ్ సినిమాకు పని చేసే

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 11 April 2023 6:30 PM IST

Pawan Kalyan, Tollywood, original gang star

పవన్ కళ్యాణ్ సినిమాకు పని చేయాలని అనుకుంటున్నారా.. ఇది తెలుసుకోండి 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాను చూడాలంటేనే ఎగిరి గంతేస్తాం. అలాంటిది పవన్ కళ్యాణ్ సినిమాకు పని చేసే అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా చెప్పండి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 4 సినిమాలను చేస్తూ ఉన్నారు. అందులో రెండు రీమేక్ కాగా.. మరొకటి హరి హర వీరమల్లు, ఇంకొకటి ఓజీ(ఒరిజినల్ గ్యాంగ్ స్టర్). ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తూ వస్తున్నాడు. ప్రభాస్ తో సాహో అనే సినిమాను ఎంతో గ్రాండ్ గా తీశాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను లైన్ లో పెట్టి.. ఓ సూపర్ హిట్ ఇస్తానని అభిమానులకు ప్రామిస్ చేశాడు. అంతేకాకుండా సినిమా రీమేక్ కాకపోవడంతో సినీ అభిమానులకు కూడా కాస్త గుడ్ న్యూస్ అనుకోండి.

ఇప్పుడు ఈ సినిమాకు పని చేసే అవకాశం దక్కించుకునే వ్యక్తి ఎవరా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ‘ఓజీ’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాకు 'క్రియేటివ్ ఎడిటర్' కావాలంటూ తాజాగా చిత్ర యూనిట్ ఒక పోస్ట్ షేర్ చేసింది. 2023 ఏప్రిల్ 14లోగా ఆసక్తి ఉన్నవారు తమకు వివరాలను మెయిల్ చేయాలని చిత్ర యూనిట్ తెలిపింది. మరైతే మీలో కూడా ఎడిటింగ్ ట్యాలెంట్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి.

Next Story