హనీ సింగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య

Yo Yo Honey Singh's wife alleges domestic violence. గాయకుడు మరియు నటుడు యో యో హనీ సింగ్ భార్య షాలినీ తల్వార్ భర్తపై గృహ హింస

By Medi Samrat
Published on : 3 Aug 2021 7:09 PM IST

హనీ సింగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య

గాయకుడు మరియు నటుడు యో యో హనీ సింగ్ భార్య షాలినీ తల్వార్ భర్తపై గృహ హింస, లైంగిక హింస, మానసిక వేధింపులు, ఆర్థికంగా మోసం చేశాడనే అభియోగాలపై కేసు నమోదు చేసింది. ఆమె 'గృహ హింస నుంచి మహిళలను రక్షించే చట్టం' కింద ఢిల్లీలోని టిస్ హజారీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆగస్టు 3 న, టిస్ హజారీ కోర్టులో చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు కేసు నమోదు చేయబడింది. హనీ సింగ్ భార్య షాలినీ తల్వార్ తరఫున న్యాయవాది సందీప్ కపూర్, అపూర్వ పాండే, జిజి కశ్యప్ హాజరయ్యారు. ఆగస్టు 28 లోపు తన సమాధానం దాఖలు చేయాలని కోర్టు హనీ సింగ్‌కు నోటీసు జారీ చేసింది. షాలిని తల్వార్‌కు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.

2014 లో రియాలిటీ షో ఇండియాస్ రాక్ స్టార్ ఎపిసోడ్‌లో హనీ సింగ్ తన భార్యను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. అతను బాలీవుడ్ మెగా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సమయంలో ఆమెను వివాహం చేసుకున్నందుకు చాలా మంది ఆశ్చర్యపోయారు. యో యో హనీ సింగ్ దీపికా పదుకొనే, సైఫ్ అలీ ఖాన్ చిత్రం కాక్టెయిల్‌లోని అంగ్రేజీ బీట్ పాట సూపర్‌హిట్ అయిన తర్వాత మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఎన్నో సింగిల్స్ అతడికి యూత్ లో భారీ క్రేజ్ ను తీసుకుని వచ్చాయి.


Next Story