యాత్ర-2 టీజర్ వచ్చేస్తోంది..!

యాత్ర.. తెలుగులో వచ్చిన పొలిటికల్ సినిమాలలో ఓ ట్రేడ్ మార్క్ ను సృష్టించింది.

By Medi Samrat  Published on  3 Jan 2024 9:30 PM IST
యాత్ర-2 టీజర్ వచ్చేస్తోంది..!

యాత్ర.. తెలుగులో వచ్చిన పొలిటికల్ సినిమాలలో ఓ ట్రేడ్ మార్క్ ను సృష్టించింది. ఎంతో క్లాస్ హిట్ గా నిలిచింది. ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో 2019లో వచ్చిన యాత్ర సినిమాకు మహి వి రాఘవ్‌ దర్శకత్వం వహించాడు. మ‌ల‌యాళ న‌టుడు మమ్ముట్టి ఈ సినిమాలో వైఎస్ పాత్ర‌లో న‌టించి అల‌రించాడు. ఇక ఈ చిత్రానికి సీక్వెల్‌గా యాత్ర 2 తెర‌కెక్కుతూ ఉంది. వైఎస్. రాజశేఖర్‌రెడ్డి త‌న‌యుడు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి నిజ జీవితంలో చోటుచేసుకున్న ఘటనల ఆధారంగా ఈ సినిమా ఉండబోతుండడంతో మూవీ లవర్స్ లో మరింత ఆసక్తి నెలకొంది. జగన్మోహన్ రెడ్డి పాత్ర‌లో కోలీవుడ్ యాక్ట‌ర్ జీవా న‌టిస్తున్నాడు. యాత్ర 2 టీజ‌ర్‌ను జ‌న‌వ‌రి 05న ఉద‌యం 11 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్ వెల్ల‌డించింది. త్రీ ఆటమ్‌ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్న ‘యాత్ర 2’ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను 2024 ఫిబ్రవరి 08న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలు పొలిటికల్ సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. మరో వైపు రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా కూడా కోర్టు కేసుల అనంతరం థియేటర్లలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.

Next Story