యాత్ర-2 గురించి సంచలన విషయాలు చెప్పిన సినిమా యూనిట్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణాంతరం చోటు చేసుకున్న పరిణామాలు..
By Medi Samrat Published on 6 Feb 2024 4:15 PM GMTఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణాంతరం చోటు చేసుకున్న పరిణామాలు.. ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ జర్నీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా యాత్ర 2. డైరెక్టర్ మహి వి రాఘవ్ ఈ సినిమాను తెరెకెక్కించారు. ఈ మూవీ ఫిబ్రవరి 8న రిలీజ్ కాబోతుంది. ఇక సినిమాకు సంబంధించి మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు.
డైరెక్టర్ మహి వి రాఘవ్ మాట్లాడుతూ.. సినిమాలో చాలా విషయాలు ప్రజలకు తెలియనివి చూపించామని తెలిపారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణాంతరం జగన్ పాదయాత్ర వంటి అంశాలు జరిగిన విషయాలు మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో ఈ సినిమాలో ఉన్నాయన్నారు. యాత్ర 2 సినిమాను ఎలా తీశాం, ఏ ఎమోషన్‌తో ముందుకు నడిపించామన్నది ఏ ఒక్కరికీ తెలియదన్నారు దర్శకుడు. ఎన్నో ఎమోషనల్ సీన్స్, ఎన్నో తెలియని అంశాలతో ‘యాత్ర 2’ని సినిమాని చాలా ఎమోషన్గా తీశాను. ట్రైలర్‌లో చూపించిన ఆ ఎమోషనల్ సీన్లు నిజంగానే జరిగాయా? లేదా? అన్నది పక్కన పెడితే..ఆ సీన్‌తో ఎమోషన్‌ను జనాలకు కనెక్ట్ చేశామా? అన్నదే సినిమా ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఈ సినిమాలో ఒకర్ని ఎక్కువ చూపించడం..ఇంకొకరిని తక్కువ చేసి చూపించడం అనేది చేయలేదు. సినిమా చూశాకా నమ్మేలా ఉందా? పూర్తిగా భజనలా అనిపించిందా? అన్నది ఆడియెన్స్‌కి అర్థం అవుతుందన్నారు. వైఎస్ జగన్ పాదయాత్ర చేసినప్పుడు ఎంతో మంది ఆయన వెనకాల నిలిచారు అనేది చెప్పడం కోసం ఆ అంధుడి పాత్రని సినిమాలో చూపించాం అని డైరెక్టర్ మహి తెలిపారు. పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబు రీ రిలీజ్ గురించి దర్శకుడు స్పందించారు. ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా, రీ రిలీజ్ చేసినా పర్వాలేదని అన్నారు. ఎప్పుడైనా అన్నీ సినిమాలు బాగా ఆడాలి, ఆ డబ్బులన్నీ మన ఇండస్ట్రీకే వస్తాయని అన్నారు. అన్ని సినిమాలకు కలెక్షన్స్ వస్తే..థియేటర్ యాజమానులు బాగుంటారన్నారు.