ఆగయా 'తూఫాన్' సాంగ్.. రాకీ భాయ్ నీకు ఎదురెళ్లడానికి ఎవరూ ప్రయత్నించరు

Yash whips up a Toofan in KGF Chapter 2 new song. రాకింగ్ స్టార్ యష్ 'KGF చాప్టర్ 2' కూడా ఇక ప్రమోషన్స్ మొదలు పెట్టేసింది.

By Medi Samrat  Published on  21 March 2022 7:05 AM GMT
ఆగయా తూఫాన్ సాంగ్.. రాకీ భాయ్ నీకు ఎదురెళ్లడానికి ఎవరూ ప్రయత్నించరు

రాకింగ్ స్టార్ యష్ 'KGF చాప్టర్ 2' కూడా ఇక ప్రమోషన్స్ మొదలు పెట్టేసింది. ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా.. ప్రమోషన్స్ పెద్దగా చేయడం లేదనే విమర్శలు వచ్చాయి. ఎట్టకేలకు చిత్ర బృందం సెకండ్ పార్ట్ కు సంబంధించి సాంగ్ ను విడుదల చేసింది. KGF చాప్టర్ 2 అఫీషియల్ ట్రైలర్‌ కు ఇప్పటికే ముహూర్తం పెట్టగా.. "తూఫాన్" లిరికల్ వీడియో సాంగ్ స్ట్రీమింగ్ గురించి ప్రకటనలు అభిమానులలో ఉత్సాహాన్ని నింపాయి.


మేకర్స్ వాగ్దానం చేసినట్లుగా తూఫాన్ లిరికల్ వీడియో సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌లో ప్రసారం అవుతోంది. ఈ పాటకు రవి బస్రూర్ సంగీత దర్శకత్వం వహించాడు. షబ్బీర్ అహ్మద్ సాహిత్యం అందించారు. లహరి మ్యూజిక్, T సిరీస్ యొక్క అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో పాట సౌత్ వెర్షన్‌లు స్ట్రీమింగ్ అవుతుండగా, హిందీ వెర్షన్ MRT మ్యూజిక్ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులో ఉంది. 'తూఫాన్' అంటూ సాగే ఈ పాటలో హీరో గురించి వివరించారు. "అతను మా జీవితాల్లోకి రాకముందు చావు మా మీద గంతులేసేది .. అతను వచ్చిన తరువాత చావు మీద మేము గంతులేస్తున్నాం. అతను తూఫాన్ లాంటివాడు సార్ .. అతనికి ఎదురెళ్లడానికి ప్రయత్నిచవద్దు" అంటూ హీరో గురించి ఇంట్రడక్షన్ తో ఈ సాంగ్ మొదలవుతుంది.

తూఫాన్ హై ఆక్టేన్ ట్రాక్ గా చెప్పుకోవచ్చు. లిరికల్ వీడియోకు ఇప్పటికే భారీ వ్యూస్ వస్తున్నాయి, కామెంట్స్ విభాగంలో అభిమానులు తమ ప్రేమను కురిపిస్తున్నారు. సంతోష్ వెంకీ, మోహన్ కృష్ణ, సచిన్ బస్రూర్, రవి బస్రూర్, పునీత్ రుద్రనాగ్, వర్ష ఆచార్యతో కూడిన గాయకుల బృందం ఈ పాటను పాడింది. వర్ష ఆచార్య కూడా పాట పాడింది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో విడుదలైంది ఈ పాట. దర్శకుడు ప్రశాంత్ నీల్, చిత్ర కథానాయకుడు యష్, 'K.G.F' మొత్తం టీమ్ కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో పాటకు సంబంధించిన లింక్స్ ను షేర్ చేశారు.
Next Story
Share it