హమ్మయ్య.. కేజీఎఫ్ స్టార్ నెక్ట్స్‌ సినిమా అప్డేట్ వచ్చింది..!

కేజీఎఫ్ సినిమా ద్వారా దేశం మొత్తం పాపులారిటీని దక్కించుకున్న కన్నడ నటుడు యష్ సుదీర్ఘ విరామం తీసుకున్న తర్వాత మరో భారీ బడ్జెట్ సినిమాతో రాబోతున్నాడు.

By Medi Samrat  Published on  6 Jan 2025 9:15 PM IST
హమ్మయ్య.. కేజీఎఫ్ స్టార్ నెక్ట్స్‌ సినిమా అప్డేట్ వచ్చింది..!

కేజీఎఫ్ సినిమా ద్వారా దేశం మొత్తం పాపులారిటీని దక్కించుకున్న కన్నడ నటుడు యష్ సుదీర్ఘ విరామం తీసుకున్న తర్వాత మరో భారీ బడ్జెట్ సినిమాతో రాబోతున్నాడు. యష్ 'టాక్సిక్: ది మూవీ'తో మూవీ లవర్స్ ను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ కోసం అభిమానులు, ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. మేకర్స్ ఎట్టకేలకు ప్రకటనను విడుదల చేశారు. జనవరి 8వ తేదీన యష్ పుట్టినరోజు సందర్భంగా అప్‌డేట్ రానుంది.

యష్ కారుపై వాలుతూ స్మోకింగ్ చేస్తూ కనిపించిన పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం వివిధ లొకేషన్లలో జరుగుతూ ఉంది. బెంగుళూరు శివార్లలో ప్రత్యేకంగా సినిమా కోసం వేసిన సెట్‌లో కూడా జరుగుతోంది. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా చెబుతున్న ఈ చిత్రానికి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. KVN ప్రొడక్షన్స్ నిర్మించనుంది.

Next Story