లైఫ్ ఆఫ్ రామ్ పాటతో వైరల్.. చివరికి టైటిల్ విన్నర్
Yasaswi Kondepudi as Sa Re Ga Ma Pa Telugu 13 winner.సరిగమప విన్నర్ గా నిలిచిన యశస్వి కొండేపూడి
By Medi Samrat Published on 22 March 2021 3:01 PM ISTజాను సినిమాలోని 'లైఫ్ ఆఫ్ రామ్' పాట ఎప్పుడైతే సరిగమపలో యశస్వి కొండేపూడి పాడాడో అతడి పాటకు అందరూ ఫిదా అయిపోయారు. అదే ఊపులో పలు సాంగ్స్ పాడుతూ షోలో స్టార్ గా ఎదిగాడు. చివరికి సరిగమప – ది నెక్స్ట్ సింగింగ్ ఐకాన్ కి విజేతగా నిలిచారు. అతిరధ మహారథుల నడుమ జరిగిన ఈ గ్రాండ్ ఫినాలే కు ప్రదీప్ మాచిరాజు యాంకర్ గా వ్యవహరించగా, రానా దగ్గుబాటి ట్రోఫీని విజేతకు అందజేశారు. భరత్ రాజ్ మొదటి రన్నరప్ గా నిలువగా.. యశస్వి కొండేపూడి ట్రోఫీ, టైటిల్ తో పాటు 5 లక్షలు ప్రైజ్ మనీగా గెలుచుకున్నారు. ఈ గ్రాండ్ ఫినాలేకు సీద్ శ్రీరామ్, రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్, బాబా సెహగల్, గాయనీమణులు సునీత, కల్పన వచ్చారు. సిద్ శ్రీరామ్ యొక్క లైవ్ పర్ఫార్మెన్స్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.
విన్నర్ గా నిలిచిన యశస్వి కొండేపూడి మాట్లాడుతూ.. తాను టైటిల్ గెలవడాన్ని ఇంకా నమ్మలేకపోతున్నానని తెలిపాడు. టైటిల్ గెలవడం పట్ల చాలా సంతోషంగా ఉందని.. నాకు వోట్ చేసిన నా అభిమానుల అందరికి కూడా నేను పాదాభివందనం చేస్తున్నానని తెలిపాడు. నాకు తోడుగా నిలిచినాజడ్జెస్ మరియు నా మెంటార్స్ అందరికి కూడా నేను శతకోటి నమస్కారాలు తెలుపుకుంటున్నానన్నాడు. ఎంతో మధురానుభూతులు మరియు సంగీత పరమైన జ్ఞానం నేను నా వెంట తీసుకువెళ్తున్నందుకు నేను చాల సంతోషిస్తున్నానని చెప్పుకొచ్చాడు.