కృతి సనన్ అవార్డు..ఆ రీల్‌ను లైక్ చేసిన యామీ గౌతమ్
అవార్డు వేడుకలో కృతి సనన్ 'ఉత్తమ నటి'గా ఎంపికవ్వడాన్ని విమర్శిస్తూ వచ్చిన ఒక సోషల్ మీడియా రీల్‌ను లైక్ చేయడంపై నటి యామీ గౌతమ్ స్పందించారు
By - Knakam Karthik |
కృతి సనన్ అవార్డు..ఆ రీల్‌ను లైక్ చేసిన యామీ గౌతమ్
అవార్డు వేడుకలో కృతి సనన్ 'ఉత్తమ నటి'గా ఎంపికవ్వడాన్ని విమర్శిస్తూ వచ్చిన ఒక సోషల్ మీడియా రీల్‌ను లైక్ చేయడంపై నటి యామీ గౌతమ్ స్పందించారు. ఆ లైక్ అనుకోకుండా జరిగిందే తప్ప కావాలని చేసింది కాదని ఆమె స్పష్టం చేశారు. జీ సినీ అవార్డ్స్‌లో 'తేరే ఇష్క్ మే' చిత్రానికి గానూ కృతి సనన్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. అయితే, 'హక్' (Haq) సినిమాలో యామీ గౌతమ్ నటనకు ఈ అవార్డు రావాల్సిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది. కృతి సనన్ అవార్డు గెలుచుకున్న దృశ్యాలను, గతంలో యామీ గౌతమ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ క్లిప్‌తో కలిపి ఒక రీల్ రూపొందించారు. ఆ ఇంటర్వ్యూలో యామీ.. "మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్నిసార్లు ఫలితం ఉండదు, అందుకే నేను అవార్డుల గుర్తింపు కోసం ఆశ పడటం మానేశాను" అని వ్యాఖ్యానించారు.
ఈ రీల్‌ను యామీ గౌతమ్ లైక్ చేసినట్లు నెటిజన్లు గమనించడంతో వివాదం మొదలైంది. దీనిపై యామీ గౌతమ్ X (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ వివరణ ఇచ్చారు. "మరో నటిని తక్కువ చేసి చూపే ఒక రీల్‌ను నేను 'లైక్' చేసినట్లు నా దృష్టికి వచ్చింది. ప్రతిరోజూ మాకు ఎన్నో పోస్ట్‌లలో ట్యాగ్స్ వస్తుంటాయి. అవార్డు వేడుకకు సంబంధించిన ట్యాగ్‌లను చూస్తున్నప్పుడు ఇది కూడా అలాగే వచ్చింది. నేను దానిని కావాలని లైక్ చేయలేదు, బహుశా అనుకోకుండా అది క్లిక్ అయి ఉండవచ్చు" అని ఆమె పేర్కొన్నారు. నా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి చౌకబారు పీఆర్ (PR) టెక్నిక్స్ ఉపయోగించలేదు.. నేను ఎప్పుడూ నా పని మీద మాత్రమే దృష్టి పెడతానని యామీ గౌతమ్ అన్నారు.
It has come to my notice that I apparently ‘liked’ a reel that is condescending toward another actor. We get tagged in multiple things every day, and this appeared during an award-function reference like any other tag. It isn’t true and was definitely not done consciously, if…
— Yami Gautam Dhar (@yamigautam) March 5, 2026