Viral Video : రీల్స్ పిచ్చి.. ఇష్ట‌మొచ్చిన‌ట్లు తిడుతున్నారు..!

సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధ పడుతూ ఉంటారు కొందరు

By Medi Samrat  Published on  23 Sept 2024 2:56 PM IST
Viral Video : రీల్స్ పిచ్చి.. ఇష్ట‌మొచ్చిన‌ట్లు తిడుతున్నారు..!

సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధ పడుతూ ఉంటారు కొందరు. అలాంటి కోవలోకే చెందుతుంది ఈ మహిళ కూడా. ఓ బావి దగ్గర వీడియో చేస్తూ కనిపించింది. తన చేతుల్లోని చిన్నారి ప్రాణాలను ప్రమాదంలో పడేసినందుకు ఆ మహిళను ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారు నెటిజన్లు. 'రా అండ్ రియల్ మ్యాన్' ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. ఆమె బాధ్యతారహిత చర్యలకు సోషల్ మీడియా వినియోగదారులు.. నువ్వు నిజంగా తల్లివేనా అంటూ తిట్టడం మొదలుపెట్టారు.

22-సెకన్ల క్లిప్‌లో, మహిళ ప్రమాదకరంగా బావి అంచున కూర్చుంది. ఒక కాలు లోపల వేలాడుతూ ఉంది, అదే సమయంలో ఆ పిల్లవాడు అదే కాలుకు అతుక్కున్నాడు. ఆమె అక్కడ పొంచి ఉన్న ప్రమాదాన్ని పట్టించుకోకుండా ఒక పాటను పాడుతూ కనిపించింది. ఆమెపై యాక్షన్ తీసుకోవాలంటూ పలువురు డిమాండ్ చేశారు.

Next Story