భార‌తీయ‌ సినీ చ‌రిత్ర‌లో కోటి రూపాయ‌ల రెమ్యునరేషన్ అందుకున్న తొలి స్టార్ హీరో ఎవ‌రో తెలుసా..?

Which Indian Actor First to charge rs 1 crore for movie the answer might surprise you. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది స్టార్ హీరోలు 100 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Jun 2023 8:58 AM GMT
భార‌తీయ‌ సినీ చ‌రిత్ర‌లో కోటి రూపాయ‌ల రెమ్యునరేషన్ అందుకున్న తొలి స్టార్ హీరో ఎవ‌రో తెలుసా..?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది స్టార్ హీరోలు 100 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్‌ వసూలు చేస్తున్నారని మనకు తెలిసిందే. కొంత మంది నటీనటులు రెమ్యూనరేషన్‌తో పాటు సినిమాలకు వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని ఇంటికి తీసుకువెళుతున్నారు. అయితే భారతదేశంలో కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న తొలి నటుడు ఎవరో తెలుసా?

భారతదేశంలో స్టార్ హీరోలు అయిన అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రజనీకాంత్‌తో సహా కోలీవుడ్, బాలీవుడ్‌లోని చాలా మంది స్టార్ హీరోలు కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకోవడం అంటేనే భయపడిపోయే వాళ్లు. ఏ హీరోకు కూడా అంత మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు ముందుకు రాని సమయంలో.. ఒక టాలీవుడ్ స్టార్ హీరో వారందరికంటే టాప్‌లో నిలబడ్డాడు. ఆయన మరెవరో కాదు.. మన మెగాస్టార్ చిరంజీవి. సెప్టెంబర్ 1992లో.. ఆయన రెమ్యునరేషన్ గురించి పలు ప్రముఖ పత్రికలూ మొదటి పేజీలో ప్రచురించాయి. వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకుని స్టార్ హీరోగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు రెమ్యునరేషన్ గా అందుకుని.. అమితాబ్‌ బచ్చన్ కంటే బిగ్ స్టార్ అని నిరూపించుకున్నారనేది వార్త‌ల సారాంశం.

సినిమా పేరు ఏమిటి?

1992లో విడుదలైన తెలుగు సినిమా ఆపద్బాంధవుడు కోసం చిరంజీవి దాదాపు రూ. 1.25 కోట్ల భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసినట్లు తెలిసింది. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యావరేజ్ గా నిలిచింది. మీనాక్షి శేషాద్రి ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకు ముందు చిరంజీవి-విశ్వనాథ్ కాంబినేషన్ లో శుభలేఖ, స్వయంకృషి వంటి హిట్‌ చిత్రాలు వచ్చాయి. హ్యాట్రిక్ సినిమా కావడంతో సినిమా మీద భారీ అంచనాలు ఉండేవి.

మెగాస్టార్ కారణం

అప్పట్లో రెమ్యునరేషన్ పరంగా ఒక్క సినిమాకు 85-90 లక్షలు తీసుకుంటున్న అమితాబ్ బచ్చన్‌ను మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా అధిగమించారు. కోలీవుడ్ సూపర్ స్టార్ కమల్ హాసన్ కూడా 1994లో రూ. 1 కోటి క్లబ్‌లో చేరారు. 1995లో చిన్న విరామం తర్వాత అమితాబ్ బచ్చన్ నటనకు తిరిగి వచ్చారు. ఆయన ప్రతి చిత్రానికి కోటి వసూలు చేయడం ప్రారంభించారు.

మెగాస్టార్ ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నాడు?

ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన వాల్తేర్ వీరయ్య సినిమా కోసం చిరంజీవి 48 నుంచి 50 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకున్నారనే టాక్ నడిచింది. ఇప్పటి జనరేషన్ హీరోలలో రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, కమల్ హాసన్, అక్షయ్ కుమార్, జూనియర్ ఎన్టీఆర్ వంటి నటులు చిరంజీవి కంటే చాలా ఎక్కువ పారితోషికం తీసుకుంటూ ఉన్నారు.


Next Story