'గేమ్‌ ఛేంజర్‌' మాకు కంబ్యాక్‌ మూవీ.. టికెట్‌ రేట్స్‌ హైక్‌ అడుగుతాం: దిల్‌ రాజు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాదిరిగానే.. తెలంగాణ ప్రభుత్వమూ టికెట్‌ రేట్స్‌ హైక్‌ ఇస్తుందని ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు ఆశాభావం వ్యక్తం చేశారు.

By అంజి  Published on  6 Jan 2025 11:22 AM IST
Telangana government, ticket prices, movie, Game Changer, Dil Raju, Tollywood

'గేమ్‌ ఛేంజర్‌' మాకు కంబ్యాక్‌ మూవీ.. టికెట్‌ రేట్స్‌ హైక్‌ అడుగుతాం: దిల్‌ రాజు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాదిరిగానే.. తెలంగాణ ప్రభుత్వమూ టికెట్‌ రేట్స్‌ హైక్‌ ఇస్తుందని ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌ టికెట్‌ రేట్లు పెంచేందుకు అనుమతించను అని చెప్పారని రిపోర్టర్స్‌ గుర్తు చేయగా దిల్‌ రాజు స్పందించారు. 'సీఎం గారి స్పీచ్‌ మొత్తం వినండి. ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదని, ఏం కావాలన్నా ఇస్తామన్నారు. అందుకే టికెట్‌ రేట్లు పెంచమని అడుగుతాం. అడగంంది అమ్మయినా అన్నం పెట్టదు. ఆయన నిర్ణయమే ఫైనల్‌'' అని చెప్పారు. డైరెక్టర్‌ శంకర్‌, తనకు 'గేమ్‌ ఛేంజర్‌' కంబ్యాక్‌ మూవీ అని దిల్‌ రాజు అన్నారు.

'శంకర్‌ కథ చెప్పినప్పుడు మేం ఏది నమ్మామో అది సినిమాలో ఉందా? అని చాలాసార్లు చర్చించుకున్నాం. సాధారణంగా శంకర్‌తో పాటు పెద్ద డైరెక్టర్లతో క్రియేటివిటీ విషయంలో నిర్మాతలకు అంతగా యాక్సెస్‌ ఉండదు. కానీ నేను ఆయనతో అప్రోచ్‌ అవుతూ వర్క్‌ చేశాం. ఈ రిజల్ట్‌ మీకూ నాకు ముఖ్యమని ఆయనతో చెప్పాను' అని దిల్‌రాజు అన్నారు. 'రాజమండ్రిలో ఇటీవల జరిగిన 'గేమ్‌ ఛేంజర్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నుంచి తిరిగి వెళ్తూ ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ విషయం తనకు ఇవాళే తెలిసిందని నిర్మాత దిల్‌ రాజు తెలిపారు. వారికి ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఇస్తున్నట్టు తెలిపారు. కాకినాడకు చెందిన మణికంఠ, చరణ్‌ అనే ఇద్దరు యువకులు బైక్‌పై వెళ్తుండగా ఐచర్ వ్యాన్‌ ఢీకొట్టడంతో మృతి చెందిన విషయం తెలిసిందే.

Next Story