వాల్తేరు వీరయ్య నుండి వచ్చేస్తున్న 'బాస్‌ పార్టీ' సాంగ్‌

Waltair Veerayya first single Boss Party on November 23rd. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా 'వాల్తేరు వీరయ్య'. బాబీ (కేఎస్ ర‌వీంద్ర‌) దర్శకత్వం

By M.S.R  Published on  20 Nov 2022 8:14 PM IST
వాల్తేరు వీరయ్య నుండి వచ్చేస్తున్న బాస్‌ పార్టీ సాంగ్‌

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా 'వాల్తేరు వీరయ్య'. బాబీ (కేఎస్ ర‌వీంద్ర‌) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్‌ టీజర్‌ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమా మేకర్స్‌ ఫస్ట్‌ సింగిల్‌ కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. 'బాస్‌ పార్టీ' అంటూ మొదటి పాట రాబోతోందని అప్‌డేట్ అందించారు. మేకర్స్ నవంబర్ 23న సాయంత్రం 4 గంటలకు బాస్‌ పార్టీ సాంగ్‌ను విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించి సాంగ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవీ శ్రీ ప్రసాద్‌ మెగా హీరోలకు, ముఖ్యంగా చిరంజీవికి గతంలో అదిరిపోయే సాంగ్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమా ఆల్బమ్ కూడా అదే స్థాయిలో ఉంటుందని అభిమానులు ఆశిస్తూ ఉన్నారు. బాస్‌ పార్టీ సాంగ్‌లో చిరంజీవి డ్యాన్స్ అదిరిపోనుందని, ఈ విషయాన్ని తెలియజేస్తున్నందుకు చాలా ఎక్జయిట్‌గా ఉందని ఇప్పటికే ట్వీట్ చేశాడు డీఎస్పీ. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా స్పెషల్ సాంగ్‌లో మెరువనుంది. ఈ మూవీలో మాస్ మహారాజా ర‌వితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో శృతిహాస‌న్ కూడా నటిస్తోంది. వాల్తేరు వీరయ్య 2023 జనవరి 13న థియేటర్లలో విడుదల కాబోతోంది.


Next Story