అఘోరాగా మారిపోయిన విశ్వక్ సేన్

విభిన్న సినిమాలను తీసుకుంటూ ముందుకు వెళుతున్న విశ్వక్ సేన్.. మరో కొత్త రోల్ లో కనిపించబోతున్నాడు.

By Medi Samrat  Published on  28 Jan 2024 7:42 PM IST
అఘోరాగా మారిపోయిన విశ్వక్ సేన్

విభిన్న సినిమాలను తీసుకుంటూ ముందుకు వెళుతున్న విశ్వక్ సేన్.. మరో కొత్త రోల్ లో కనిపించబోతున్నాడు. 'గామి' సినిమాలో విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించనున్నాడు. యూత్‌ఫుల్ హీరో విశ్వక్ సేన్, కార్తీక్ శబరీష్ నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండగా.. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో గామి సినిమా చేస్తున్నాడు. వి సెల్యులాయిడ్ బ్యానర్ సమర్పిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. గామిలో విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించనున్నాడు. విశ్వక్ సేన్ రెగ్యులర్‌గా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లు చేయడంతో పాటు యూనిక్‌ కాన్సెప్ట్‌లతోనూ ప్రయోగాలు చేస్తున్నాడు. గామీ సినిమాను అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. క్రౌడ్ ఫండింగ్.. అంటే జనాలే ఈ సినిమాకు నిధులు సమకూరుస్తున్నారు.

హైదరాబాద్ కామిక్ కాన్‌లో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించడం ద్వారా ప్రమోషన్‌లను ప్రారంభించారు. అఘోరా గెటప్‌లో విశ్వక్ సేన్ తప్పకుండా ఆశ్చర్యపరుస్తాడు. అతని చుట్టూ చాలా మంది అఘోరాలు అతనిని తాకడానికి ప్రయత్నిస్తూ ఉన్నట్లు పోస్టర్ లో కనిపించింది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ 'శంకర్' అనే అఘోరాగా నటిస్తున్నాడని మేకర్స్ ప్రకటించారు. కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరి కథానాయికగా నటిస్తుండగా, ఎం జి అభినయ, హారిక పెదాడ, మహ్మద్ సమద్ ముఖ్య తారాగణంగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించనున్నారు.

Next Story