క్షమించమంటున్న మంచు విష్ణు

మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా 'కన్నప్ప' మరోసారి వాయిదా పడింది.

By Medi Samrat
Published on : 29 March 2025 2:45 PM IST

క్షమించమంటున్న మంచు విష్ణు

మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా 'కన్నప్ప' మరోసారి వాయిదా పడింది. వీఎఫ్‌ఎక్స్‌ కారణంగా సినిమా రిలీజ్‌ ఆలస్యం అవుతోందని మంచు విష్ణు సోషల్‌ మీడియాలో వెల్లడించారు. తనను క్షమించాలని కోరారు. అత్యున్నత విలువలతో కన్నప్ప సినిమాను మీ ముందుకు తీసుకురావాలని మేము ఎంతగానో ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కొన్ని కీలక సన్నివేశాలకు ఇంకా వీఎఫ్‌ఎక్స్‌ చేయాల్సి ఉంది. దీనికి మరికొంత సమయం పడుతుందని, ఫలితంగా సినిమా రిలీజ్‌ కాస్త ఆలస్యం అవుతుందని మంచు విష్ణు తెలిపారు. త్వరలోనే కొత్త రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తామని తెలిపారు.

ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌బాబు, ప్రభాస్, శరత్‌ కుమార్, మోహన్ లాల్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్ బాబు నిర్మించారు. పలు రిలీజ్ డేట్స్ వాయిదాల ఏప్రిల్‌ 25న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అనుకున్న సమయానికి రావట్లేదని మంచు విష్ణు అధికారికంగా ప్రకటించారు.

Next Story