మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప ఈ ఏప్రిల్ నెలాఖరులో థియేటర్లలో విడుదల అవ్వాల్సి ఉంది. అయితే, VFX లో జాప్యం కారణంగా విడుదల తేదీ వాయిదా పడింది. తాజాగా కన్నప్ప కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రం జూన్ 27, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ ను ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా ఆవిష్కరింపచేశారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ని సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, ఈ చిత్రానికి కొరియోగ్రఫీ అందించిన ప్రభుదేవా మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన 'కన్నప్ప' కొత్త విడుదల తేదీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. రిలీజ్ డేట్ పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం సీఎం యోగి మూవీ యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే.