12 సంవత్సరాల తర్వాత విడుదల కానున్న విశాల్ సినిమా.. అదే పండగ స్పెషల్

విశాల్ హీరోగా నటించిన సినిమా 12 సంవత్సరాల తర్వాత విడుదల కాబోతోంది.

By Medi Samrat  Published on  3 Jan 2025 7:58 PM IST
12 సంవత్సరాల తర్వాత విడుదల కానున్న విశాల్ సినిమా.. అదే పండగ స్పెషల్

విశాల్ హీరోగా నటించిన సినిమా 12 సంవత్సరాల తర్వాత విడుదల కాబోతోంది. సంక్రాంతి/పొంగల్‌కు ఈ సినిమా విడుదల కానుంది. విశాల్ చిత్రం 'మధ గజ రాజా' 2013లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఆ సమయంలో ట్రైలర్ కూడా విడుదల అయింది. అయితే ఈ సినిమా చాలా సార్లు వాయిదా పడుతూ.. పడుతూ.. ఇప్పుడు పొంగల్ కి తమిళనాడు థియేటర్లలోకి రానుంది.

విశాల్ చివరిసారిగా థియేటర్లలో కనిపించిన రత్నం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. 12 ఏళ్లు వాయిదా పడుతూ వస్తున్న విశాల్ చిత్రం సంక్రాంతి/పొంగల్‌కు విడుదల కానుండడంతో తమిళ సినీ ప్రేమికులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. అజిత్ విడాముయార్చి వాయిదా పడడంతో సంక్రాంతి కానుకగా పలు సినిమాలు విడుదలకు సిద్ధమవుతూ ఉన్నాయి. సుందర్ సి దర్శకత్వం వహించగా, విజయ్ ఆంటోని సంగీతంతో జెమిని ఫిల్మ్ సర్క్యూట్ నిర్మించిన మధ గజ రాజాలో అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. అవుట్ డేటెడ్ కథతో రాబోతున్న ఈ సినిమా ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.

Next Story