కోడి పందేల బరిలో దిగిన యంగ్ హీరో విశాల్..!

Vishal watching Chicken Fight.సంక్రాంతి పండుగ అంటేనే కోడి పందేలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది.కోడి పందేల బరిలో దిగిన యంగ్ హీరో విశాల్.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Jan 2021 12:45 PM GMT
Vishal watching Chicken Fight

సంక్రాంతి పండుగ అంటేనే కోడి పందేలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి కోడి పందాలను చూడటానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తుంటారు. కోట్ల రూపాయల పందేలను కట్టడి ఈ కోడి పందాల బరిలో దిగుతున్నారు. ఈ సందర్భంగానే ప్రముఖ తెలుగు, తమిళ సినీ నటుడు, యాక్షన్ తరహా చిత్రాల్లో నటించి ఎంతోమంది ప్రేక్షకాదరణ పొందిన యంగ్ హీరో విశాల్ గురువారం కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలంలో డోకిపర్రు గ్రామంలో సందడి చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని స్థానికంగా ఉన్న శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు.

హీరో విశాల్ ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను తీసుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం హీరో విశాల్ స్వామివారి దైనందిని, కాలమానిని ఆలయ నిర్మాత, మేఘా సంస్థ ఎండీ పీవీ కృష్ణారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం అనంతరం విశాల్ స్థానికంగా ఉన్న విశ్రాంత మందిర ఆవరణంలో ఏర్పాటు చేసిన కోడి పందేలను తిలకించడానికి అక్కడికి వెళ్లారు.

విశ్రాంత మందిర ఆవరణంలో కి వెళ్ళగానే పెద్ద ఎత్తున అభిమానులు విశాల్ ను చుట్టుముట్టి ఫోటోలు దిగారు. అనంతరం అభిమానులకు అభివాదం చేస్తూ కోడి పందాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హీరో విశాల్ తో పాటు, మేఘా సంస్థ ఛైర్మన్‌ పీపీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం హీరో విశాల్ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
Next Story
Share it