విశాల్ కు మరోసారి గాయాలు.. ఈసారి తీవ్రంగా..!

Vishal gets injured again on the sets of Laththi. నటుడు విశాల్, నూతన దర్శకుడు ఎ వినోద్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం

By Medi Samrat  Published on  4 July 2022 9:45 AM
విశాల్ కు మరోసారి గాయాలు.. ఈసారి తీవ్రంగా..!

నటుడు విశాల్, నూతన దర్శకుడు ఎ వినోద్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం 'లాఠీ'. చివరి షెడ్యూల్ షూటింగ్‌ను ఇటీవలే ప్రారంభించారు. స్టార్ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్ కొరియోగ్రాఫ్ చేసిన ఇంట్రడక్షన్ ఫైట్ సీన్ కోసం చిత్రీకరిస్తున్న సమయంలో విశాల్ మరోసారి గాయపడ్డాడు. దీంతో షూట్ రద్దు చేయబడింది. నటుడు కోలుకున్న తర్వాత మళ్లీ ప్రారంభించాలని భావిస్తున్నారు.ఈ చిత్రంలో సునైనా కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ నటుడు ప్రభు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

'లాఠీ' సినిమా ఆగస్ట్ 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. విడుదల తేదీ దగ్గర పడటంతో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా హీరో విశాల్‌ చేతికి గాయాలయ్యాయి. దీంతో వెంటనే షూటింగ్ ఆపేశారు. ఇటీవల పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి చిత్రీకరణ ప్రారంభించిన విశాల్ షూటింగ్‌లో భాగంగా మరోసారి ప్రమాదానికి గురైయ్యాడు. గతంతో పోలిస్తే ఈ సారి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.










Next Story