సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించారు. ఎస్‌విసిసి బ్యానర్‌పై బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్, అజయ్, సాయి చంద్, శ్యామల, బ్రహ్మాజీ, సునీల్, రాజీవ్ కనకాల, సోనియా సింగ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. విరూపాక్ష ఏప్రిల్ 21న థియేటర్లలో విడుదలైంది. సాయిధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురై కోలుకున్న తర్వాత వచ్చిన మొదటి సినిమా ఇది. థియేటర్లలో కనకవర్షం కురిపించిన విరూపాక్ష సినిమా ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమవుతూ ఉంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను మంచి ధరకు కొనుగోలు చేసిన నెట్‌ఫ్లిక్స్, మే 21, 2023 నుండి తన ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం చేయనుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
విరూపాక్ష సినిమా కథ రుద్రవనం అనే గ్రామం చుట్టూ తిరుగుతుంది. గ్రామస్థులను రహస్యంగా చంపే దుష్టశక్తి ఆ గ్రామాన్ని వెంటాడుతూ ఉంటుంది. ఆ గ్రామానికి అలాంటి దుస్థితి కలగడానికి కారణం ఎవరు.. హీరో ఆ శక్తులను ఎలా ఎదుర్కొన్నాడు అనేది మిగిలిన కథ. మొదటి ఆట నుండే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో మంచి థియేట్రికల్ రన్ ను సాధించింది. రెండు-మూడు వారాల్లో కూడా సినిమాకు హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి.