అభిమానులతో కనెక్ట్ అవడానికి హీరో విక్రమ్ ఏం చేశాడంటే..
Vikram makes Twitter debut: I feel it’s the right time. తమిళ నటుడు విక్రమ్ మైక్రో-బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లోకి అడుగుపెట్టారు.
By Medi Samrat Published on 13 Aug 2022 4:19 PM IST
తమిళ నటుడు విక్రమ్ మైక్రో-బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లోకి అడుగుపెట్టారు. తన అభిమానులతో కనెక్ట్ అవ్వడమే ట్విట్టర్ లోకి రావడానికి కారణమని చెప్పుకొచ్చారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించిన విక్రమ్.. ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేయనున్నారు. ట్విట్టర్ లో తన అభిమానులకు ఒక వీడియో సందేశాన్ని అప్లోడ్ చేశాడు విక్రమ్.
వీడియోలో విక్రమ్ మాట్లాడుతూ.. తాను ట్విట్టర్‌లో చేరడం ఆలస్యం అయిందని ఒప్పుకున్నాడు. సినిమాల గురించి తన అభిమానులతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఎదురుచూస్తున్నానని చెప్పాడు. విక్రమ్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ "కోబ్రా", మణిరత్నం తీస్తున్న భారీ పౌరాణిక చిత్రం "పొన్నియిన్ సెల్వన్ 1" త్వరలోనే విడుదలవ్వనున్నాయి. ఆ రెండు సినిమాల విడుదలకు ముందే విక్రమ్ ట్విట్టర్‌లో చేరాడు. తమిళంలో మాట్లాడిన విక్రమ్ ప్రస్తుతం తన తదుపరి చిత్రాన్ని పా.రంజిత్‌తో చేస్తున్నట్టు వెల్లడించారు. "నా అభిమానులతో సన్నిహితంగా ఉండటానికి. నా చిత్రాల గురించి మరిన్ని విషయాలను తెలియజేయడానికి ట్విట్టర్ లోకి వచ్చాను. హా దాదాపు 15 సంవత్సరాలు ఆలస్యంగా వచ్చినప్పటికీ, ఇది సరైన సమయం అని నేను భావిస్తున్నాను, "అని చెప్పుకొచ్చారు విక్రమ్.
— Chiyaan Vikram (@chiyaan) August 12, 2022
విక్రమ్ "కోబ్రా" చిత్రానికి " ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఆగస్ట్ 31న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక మరో భారీ సినిమా "పొన్నియిన్ సెల్వన్-I" సెప్టెంబర్ 30న విడుదల కానుంది. కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా రూపొందించబడింది ఈ చిత్రం.
ఐశ్వర్య రాయ్ బచ్చన్, కార్తీ, త్రిష కృష్ణన్, ప్రకాష్ రాజ్, జయరామ్, జయం రవి, ఐశ్వర్య లక్ష్మి కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు.