రూ. 400 కోట్ల క్లబ్‌లో కమల్ హాసన్ 'విక్రమ్'

Vikram box office collection Day 24: Kamal Haasan's film enters Rs 400 crore club. కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూనే ఉంది.

By Medi Samrat  Published on  27 Jun 2022 9:04 AM IST
రూ. 400 కోట్ల క్లబ్‌లో కమల్ హాసన్ విక్రమ్

కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూనే ఉంది. రూ.400 కోట్ల క్లబ్‌లో చేరి స‌రికొత్త రికార్డును సాధించింది. ప్ర‌స్తుత ట్రెండ్‌ను చూస్తే తమిళనాడులో ఈ సినిమా మరో రెండు వారాల పాటు ఇదే రీతిన ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతుంద‌ని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.

విక్రమ్‌లో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం జూన్ 3న పలు భాషల్లో థియేటర్లలోకి వచ్చింది. కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా 24వ రోజు బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్ల మార్కును అధిగమించిందని ట్రేడ్ అనలిస్ట్ కౌశిక్ ట్వీట్ చేశారు. కేరళలోనూ ఈ సినిమా చరిత్ర సృష్టిస్తోందని ఆయన రాసుకొచ్చారు.

యాక్షన్ థ్రిల్లర్‌గా తెర‌కెక్కింది విక్రమ్ సినిమా. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో కాళిదాస్ జయరామ్, నరేన్, గాయత్రి, వాసంతి, సంతాన భారతి కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.













Next Story