సంచలన నిర్ణయం తీసుకున్న విజయ్ తండ్రి

Vijay’s father closes doors of Vijay Makkal Iyakkam. హీరో విజయ్ తండ్రి, ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ 2020లో 'విజయ్ మక్కల్ ఇయక్కం'

By Medi Samrat  Published on  28 Sep 2021 12:00 PM GMT
సంచలన నిర్ణయం తీసుకున్న విజయ్ తండ్రి

హీరో విజయ్ తండ్రి, ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ 2020లో 'విజయ్ మక్కల్ ఇయక్కం' పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. దీంతో తన అనుమతి లేకుండానే తన పేరును వాడుతున్నారంటూ తన తల్లిదండ్రులతో పాటు మరో 11 మందిపై విజయ్ కేసు పెట్టారు. తన తండ్రి పెట్టిన పార్టీతో తనకు సంబంధం లేదని గతంలోనే విజయ్ స్పష్టం చేశారు. హీరో విజయ్ తన తల్లిదండ్రులతో సహా 11 మందిపై చెన్నై సివిల్ కోర్టులో కొద్దిరోజుల కిందట కేసు పెట్టడం తమిళనాడులో హాట్ టాపిక్ అయింది. అనుమతి లేకుండా తన పేరు వాడుకుంటున్నారని ఫిర్యాదులో విజయ్ చెప్పారు. తన పేరుతో ఎలాంటి కార్యక్రమాలు, మీటింగ్స్ నిర్వహించకుండా ఉండేందుకే విజయ్ ఈ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

ఏడాది క్రితం విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్​ఏ చంద్రశేఖర్ 'ఆల్ ఇండియా తళపతి విజయ్ మక్కల్ ఇయ్యకమ్' పేరుతో రాజకీయ పార్టీ స్థాపించారు. ఆ పార్టీ పేరు రిజిస్ట్రేషన్ సమయంలో విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నాడనే ప్రచారం మొదలైంది. ఆల్ ఇండియా తళపతి విజయ్ మక్కల్ ఇయ్యకమ్ పార్టీకి విజయ్ తండ్రి చంద్రశేఖర్ జనరల్ సెక్రటరీగా, శోభా చంద్రశేఖర్ కోశాధికారిగా ఉన్నారు. పార్టీ పెట్టిన కొన్నిరోజులకే విజయ్ ఆ పార్టీకి తనకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.

"మా నాన్న పెట్టిన పార్టీతో నేరుగా, పరోక్షంగా గానీ నాకు సంబంధం లేదు. మా నాన్న పార్టీ పెట్టారని నా ఫ్యాన్స్ ఎవరూ అందులో చేరొద్దు" అని విజయ్ తన నోట్​లో చెప్పారు. పార్టీ కోసం తన పేరు, ఫొటో, ఫ్యాన్స్​ క్లబ్​ను గానీ దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటానని కూడా విజయ్ తెలిపారు. ఇళయ దళపతి ఫ్యాన్స్‌కు చెందిన ఓ రిజిస్టర్డ్ సొసైటీకి స్థానిక ఎన్నికల్లో పాల్గొనేందుకు, ఆయన తల్లిదండ్రులు అనుమతినిచ్చారు. ఇలా తన పేరు పొలిటికల్ మీటింగ్స్‌కి వాడుకోవటంపై అభ్యంతరం తెలియజేస్తూ విజయ్ కోర్టును ఆశ్రయించారు.

తన పేరు ఉపయోగించుకుని కార్యక్రమాలు నిర్వహించడంపై నిషేధం విధించాలని కోరుతూ చెన్నై హక్కుల కోర్టులో కూడా విజయ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ జరిపింది. ఈ క్రమంలో 'విజయ్ మక్కల్ ఇయక్కం'ను రద్దు చేశామని తెలుపుతూ కోర్టులో విజయ్ తండ్రి పిటిషన్ దాఖలు చేశారు.


Next Story