వారసుడు ఓటీటీ రిలీజ్ డీటైల్స్ ఇవే..!
Vijay Varasudu OTT Release Date Locked. ఈ ఏడాది సంక్రాంతికి తమిళంలో 'వారిసు' విడుదలైంది. తెలుగులో వారసుడు పేరుతో విడుదలైంది.
By Medi Samrat Published on 20 Jan 2023 9:30 PM ISTఈ ఏడాది సంక్రాంతికి తమిళంలో 'వారిసు' విడుదలైంది. తెలుగులో వారసుడు పేరుతో విడుదలైంది. తమిళ్ వెర్షన్ రూ. 200 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. వారసుడు డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఫిబ్రవరి 10 నుండి వారసుడు తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమ్ కానుందని అంటున్నారు. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వారసుడు సినిమా మొదటి రోజు 3.10 కోట్ల రూపాయలు సొంతం చేసుకోగా.. ఇక ఈ సినిమా రెండో రోజు 2.94 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా మూడో రోజు 2.69 కోట్ల గ్రాస్ దాకా షేర్‌ను సొంతం చేసుకుంది. నాల్గో రోజు రూ. 2.17 కోట్లు.. 5వ రోజు రూ. 1.41 కోట్ల గ్రాస్ రాబట్టింది. 6వ రోజు రూ. 063 కోట్ల గ్రాస్ దీంతో ఆరు రోజుల్లో ఈ సినిమాకు తెలుగులో రెండు రాష్ట్రాల్లో 12.83 కోట్ల షేర్ రాగా.. రూ. 23.25కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
వారసుడు' టైటిల్ తో ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ కెరీర్‌లో 66వ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మించారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాలో విజయ్‌తో పాటు శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, రష్మిక మందన్న, జయసుధ, ప్రభు, సంగీత కీలకపాత్రలు పోషించారు. తమిళంలో జనవరి 11న విడుదలైన ఈ సినిమా.. తెలుగులో జనవరి 14న విడుదలైంది.