ఆ సినిమాలో కూడా విలన్ గా విజయ్ సేతుపతి.. రేంజి మామూలుగా లేదుగా..!

Vijay Sethupathi to play villain in Shah Rukh Khan and Atlee's Jawan. విజయ్ సేతుపతి.. చాలా గొప్ప ఆర్టిస్ట్ అని అందరూ చెబుతూ ఉంటారు.

By Medi Samrat
Published on : 6 July 2022 6:15 PM IST

ఆ సినిమాలో కూడా విలన్ గా విజయ్ సేతుపతి.. రేంజి మామూలుగా లేదుగా..!

విజయ్ సేతుపతి.. చాలా గొప్ప ఆర్టిస్ట్ అని అందరూ చెబుతూ ఉంటారు.. ఆయన అడుగుపెట్టిన ప్రతి ఒక్క ఇండస్ట్రీలోనూ ఆ మాటను నిరూపించుకుంటూనే ఉన్నాడు. తెలుగులో 'ఉప్పెన'.. తమిళంలో 'విక్రమ్'.. సినిమాల్లో చేసిన పాత్రలకు మంచి పేరు వచ్చింది. ఇక 'పుష్ప 2' లోను నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్ర చేస్తున్నట్లుగా ప్రచారం మొదలైంది.

తాజాగా బాలీవుడ్ సినిమా 'జవాన్' లో కూడా నటించబోతున్నాడు విజయ్ సేతుపతి అని చెబుతున్నారు. హిందీలో షారుక్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ కుమార్ 'జవాన్' అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైంది. ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ రోల్ లో విజయ్ సేతుపతి చేయబోతున్నాడనే ప్రచారం మొదలైంది త్వరలోనే ఈ సినిమా షూటింగులో ఆయన జాయిన్ అవుతాడని అంటున్నారు. భారతదేశంలో అత్యంత బిజీ నటుల్లో సేతుపతి ఒకరు. డేట్స్ ను బట్టి త్వరలో షూటింగ్ కోసం ముంబైలోని సినిమా సెట్స్‌లో జాయిన్ అవుతాడు. సరైన సమయంలో అధికారిక ప్రకటన వెలువడుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ సందర్భంగా షారూఖ్ ఖాన్ విజయ్ సేతుపతిని పొగిడిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో SRK నా జీవితంలో నేను చూసిన అత్యంత అద్భుతమైన నటుడు మీరని విజయ్ ను పొగుడుతున్నాడు.












Next Story