పూరీ సినిమాలో క్రేజీ హీరోయిన్.. చాలా గ్యాప్ తర్వాత తెలుగులో..!

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు.

By Medi Samrat
Published on : 16 April 2025 9:36 PM IST

పూరీ సినిమాలో క్రేజీ హీరోయిన్.. చాలా గ్యాప్ తర్వాత తెలుగులో..!

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, టబు నటించనున్న పాన్-ఇండియా చిత్రంలో రాధికా ఆప్టే కూడా నటించనున్నారు. చాలా కాలం తర్వాత రాధికా ఆప్టే తిరిగి తెలుగు తెరపైకి రానున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానుంది.

ధోని, లెజెండ్, లయన్ లాంటి తెలుగు చిత్రాలలో నటించిన రాధికా ఆప్టే పూరీ కొత్త ప్రాజెక్ట్‌లో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. అయితే అధికారిక నిర్ధారణ ఇంకా జరగలేదు. చిత్ర యూనిట్ నుండి ప్రకటన రావాల్సి ఉంది. టబు చివరిసారిగా 'డూన్: ప్రాఫసీ'లో కనిపించగా, విజయ్ సేతుపతి 'విడుతలై' పార్ట్ 2లో కనిపించారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై చార్మీ కౌర్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు దర్శకుడు పూరి జగన్నాధ్.

Next Story