కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతిపై ఓ అమ్మాయి చేసిన ఆరోపణలు సోషల్‌మీడియలో వైరల్ అయ్యాయి. ఆయన నటించిన కొత్త సినిమా 'సార్ మేడమ్' విడుదల సందర్భంగా తనపై వచ్చిన క్యాస్టింగ్‌కౌచ్ ఆరోపణల గురించి సమాధానం ఇచ్చారు. ఆమె చేసిన ఆరోపణలు నిజం కాదని, ఆమెపై సైబర్‌క్రైమ్‌లో తన టీమ్ పిర్యాదు చేసిందని చెప్పారు.
చిత్రపరిశ్రమలోనే కాదు దూరం నుంచి నన్ను చూసిన వారు కూడా ఇలాంటి ఆరోపణలు విన్న తర్వాత నవ్వుతారని, ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు నన్ను బాధించలేవన్నారు. ఆ మహిళ చేసిన ఆరోపణలతో నా కుటుంబం, సన్నిహితులు చాలా కలత చెందారని తెలిపారు. అలాంటి వాటిని పట్టించుకోవద్దని నా కుటుంబాన్ని కోరానన్నారు. సోషల్‌మీడియాలో గుర్తింపు కోసమే ఆమె ఇలా చేస్తోందని అర్థం అవుతుందని కౌంటర్ ఇచ్చారు.