సూపర్ గుడ్ ఫిల్మ్స్ లో విజయ్ - గోపీచంద్ సినిమా

Vijay - Gopichand movie in super good films. తమిళ స్టార్ హీరో విజయ్ ఇప్పటికే టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో వారసుడు సినిమా చేశాడు.

By Sumanth Varma k  Published on  25 April 2023 4:15 PM IST
సూపర్ గుడ్ ఫిల్మ్స్ లో విజయ్ - గోపీచంద్ సినిమా

తమిళ స్టార్ హీరో విజయ్ ఇప్పటికే టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో వారసుడు సినిమా చేశాడు. ఇప్పుడు తన నెక్ట్స్ మూవీని కూడా మరో తెలుగు డైరెక్టర్‌తో చేసేందుకు విజయ్ అంగీకారం తెలిపాడు. నందమూరి బాలకృష్ణకు ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌ బస్టర్ హిట్ అందించిన యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో విజయ్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మించబోతుంది.

ఇప్పటికే గోపీచంద్ చెప్పిన కథకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఓ పవర్ ఫుల్ పోలీస్ డ్రామాగా ఈ సినిమా రాబోతుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను త్వరలోనే ఇవ్వనున్నారు. ప్రస్తుతం విజయ్ లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో ‘లియో’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా పూర్తిగాక ముందే, విజయ్ తన నెక్ట్స్ మూవీని కూడా ఓకే చేయడం విశేషం.


Next Story