ఇట్స్ అఫీషియల్.. విజయ్ దేవరకొండ-రష్మిక భార్యాభర్తలు

స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ మొమెంటోస్ అత్యంత వైభవంగా జరిగింది.

By -  Medi Samrat
Published on : 26 Feb 2026 1:33 PM IST

ఇట్స్ అఫీషియల్.. విజయ్ దేవరకొండ-రష్మిక భార్యాభర్తలు

స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ మొమెంటోస్ అత్యంత వైభవంగా జరిగింది. రెండు పద్ధతుల్లో వీరు ఒక్కటయ్యారు. అభిమానులు వీరిని ముద్దుగా పిలుచుకునే 'విరోష్' పేరునే వీరు తమ పెళ్లి థీమ్‌గా మార్చుకున్నారు.

పెళ్లికి ముందు జరిగిన సంగీత్ వేడుకలో రష్మిక 'పుష్ప 2'లోని తన ఫేమస్ సాంగ్ 'సూసేకి' పాటకు స్టెప్పులేయగా, విజయ్ దేవరకొండ 'గంగ్నమ్ స్టైల్' పాటకు సర్ప్రైజ్ డ్యాన్స్ చేసి అందరినీ అలరించాడు. పెళ్లి ఫోటోలు ముందే లీక్ అవ్వకుండా, వేదిక లోపలికి వెళ్లే అతిథుల మొబైల్ కెమెరాలకు బ్లాక్ కవర్లు వేశారు. వివాహం అనంతరం నూతన వధూవరుల తరపున స్నేహితులు, టీమ్ సభ్యులు బయట ఉన్న మీడియా ప్రతినిధులకు, ఫోటోగ్రాఫర్లకు స్వీట్లు పంచిపెట్టారు. అతి త్వరలోనే పెళ్లికి సంబంధించిన అధికారిక ఫోటోలు పంచుకున్నారు.

Next Story