ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ఖుషి'.. ఎప్పటి నుండి అంటే?

సెప్టెంబర్ 1వ తేదీన విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'ఖుషి'

By Medi Samrat  Published on  14 Sept 2023 9:30 PM IST
ఓటీటీలోకి వచ్చేస్తున్న ఖుషి.. ఎప్పటి నుండి అంటే?

సెప్టెంబర్ 1వ తేదీన విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'ఖుషి' భారీ హైప్‌ మధ్య విడుదలైంది. ఈ చిత్రం ప్రేక్షకుల నుండి సానుకూల స్పందనను అందుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టినప్పటికీ, క్లీన్ హిట్ ను అందుకోలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి OTT స్ట్రీమింగ్ డేట్ ను లాక్ చేశారు. ఈ చిత్రం డిజిటల్ హక్కులను OTT దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. అక్టోబర్ 6 నుండి స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటుందని అంటున్నారు.

ఖుషీ, చిత్రం థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసింది. విజయ్ దేవరకొండ భారీ బ్లాక్ బస్టర్ ను అయితే ఈ సినిమా ద్వారా అందుకోలేకపోయాడు. ఖుషిలో మురళీ శర్మ, జయరామ్, సచిన్ ఖేడేకర్, శరణ్య ప్రదీప్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైన పాన్-ఇండియా సినిమా. చాలా కాలం తర్వాత విజయ్‌ని రొమాంటిక్ రోల్‌లో చూశారు. సమంత కూడా సినిమాలో భాగమవ్వడం ప్లస్ గా మారింది. ఇక త్వరలోనే ఓటీటీలో సినిమా సందడి చేయనుంది.

Next Story