తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన విజయ్ దేవరకొండ

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై నటుడు విజయ్ దేవరకొండ స్పందించారు.

By Medi Samrat
Published on : 30 May 2025 4:15 PM IST

తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన విజయ్ దేవరకొండ

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై నటుడు విజయ్ దేవరకొండ స్పందించారు. కాంతారావు స్మారక అవార్డు ప్రకటించడం గౌరవంగా ఉందన్నారు. నట ప్రపూర్ణ కాంతారావు పేరిట ఈ గౌరవం లభించడం ఆనందంగా ఉందన్నారు. అవార్డు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల తెలంగాణ ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. 2016లో పెళ్లి చూపులు చిత్రానికి రెండో ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసినందకు కృతజ్ఞతలు తెలిపారు. పెళ్లి చూపులు చిత్రానికి నా హృదయంలో ఎల్లప్పుడు ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. ఈ గౌరవం, ఆనందం నా అభిమానులదే, వారి ప్రేమ నన్ను నడిపిస్తూనే ఉందన్నారు. ఈ ప్రయాణంలో తోడుగా ఉన్న కుటుంబానికి, దర్శకులకు, టీమ్ కు ధన్యవాదాలు తెలుపుతూ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.




Next Story