రింగ్ లో విజయ్ దేవరకొండ
Vijay Devarakonda Is Back To The Ring As The Shoot Resumes. విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ సినిమా 'లైగర్'.
By Medi Samrat Published on 15 Sept 2021 10:45 PM ISTవిజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ సినిమా 'లైగర్'. ఈ సినిమా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందుతూ ఉంది. పాన్ ఇండియా చిత్రంగా 'లైగర్' రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడెక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి బుధవారం కొత్త షెడ్యూల్ ప్రారంభమైందని చిత్ర బృందం తెలియజేసింది. ఈ మేరకు షూటింగ్ స్పాట్‌లో ఉన్న విజయ్ దేవరకొండ ఫొటోని విడుదల చేసింది. ఇందులో విజయ్ జుత్తుతో షర్ట్‌లేకుండా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ రింగ్‌లో కూర్చొని ఉన్నాడు. ఇది ఫైట్ సీన్‌కు సంబంధించినదిగా ఫోటో అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ఇక వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ తన ప్రత్యర్థితో రింగ్ లో తలపడుతుండగా తీసినట్టుగా తాజాగా విడుదల చేసిన లుక్ ఉంది. లైగర్ చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఈ ఏడాది చివరలో విడుదల చేసేందుకు పూరీ అండ్ టీం సన్నాహాలు చేస్తోంది.
మరో వైపు విజయ్ దేవరకొండ మల్టీ ప్లెక్స్ బిజినెస్ లోకి దిగాడు. మహబూబ్ నగర్లో ఒక మల్టీప్లెక్స్‌ను ఆవిష్కరిస్తున్నారు. ఆ మల్టీప్లెక్స్ పేరు ఏషియన్ విజయ్ దేవరకొండ సినిమాస్ (AVD సినిమాస్). మల్టీప్లెక్స్ ఇప్పుడు ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ మల్టిఫ్రెక్స్ ని ఏషియన్ సినిమాస్ వారితో కలిసి ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా ఈ మల్టీప్లెక్స్ కు సంబంధించి పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ఈ మల్టీప్లెక్స్ ఓపెనింగ్‌కి సంబంధించి అఫీషియల్ ప్రకటన రానుంది.