ఆ సమయంలో ఎంతో బాధపడ్డా : విజయ్ దేవరకొండ..!
Vijay Devarakonda About Fans. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో క్రేజీ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఎంతో బాధపడ్డాను అని తెలియజేశారు
By Medi Samrat Published on 21 Jan 2021 8:27 AM ISTప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో క్రేజీ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తాజాగా కొత్త ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు "లైగర్" అనే టైటిల్ ను తాజాగా విడుదల చేసారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ... ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఎంతో బాధపడ్డాను అని తెలియజేశారు. కెరీర్ ప్రారంభంలో నటించిన నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవడే సుబ్రహ్మణ్యం వంటి సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసిన విజయ్ అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకొని క్రేజీ హీరోగా మారిపోయాడు.
అర్జున్ రెడ్డి తర్వాత వరుస అవకాశాలు రావడంతో ప్రస్తుతం పాన్ ఇండియన్ చిత్రంలో నటించే అవకాశాన్ని సంపాదించుకున్నాడు. తాజాగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లైగర్ చిత్రాన్ని పాన్ ఇండియా రూపంలో ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్షన్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సినిమాలో అనన్య పాండే విజయ్ సరసన జత కట్టనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్ లో విజయ్ మాస్ లుక్ లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
లైగర్ ఫస్ట్ లుక్ విడుదల కావడంతో విజయ్ అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. కొందరు పాలాభిషేకం చేయగా, మరికొందరు కేక్ కట్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ విధంగా తనపై అభిమానులు చూపిన ప్రేమకు ఎంతో భావోద్వేగానికి గురైన విజయ్ మీరు నాపై చూపిన ప్రేమకు ఎంతో భావోద్వేగానికి గురి అయ్యాను. ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో ఎవరైనా నా సినిమా ను ఆదరిస్తారా? ఒక్కరైనా థియేటర్ కి వచ్చి సినిమా చూస్తారా? అని ఆ సమయంలోఎంతో బాధపడ్డానని, లైగర్ పోస్టర్ విడుదల చేసిన తర్వాత అన్ని ప్రాంతాలలో అభిమానులు సంబరాలు నిర్వహించడం చూసి నాకెంతో ఆనందం అనిపించింది. టీజర్ విడుదలైనప్పుడు కూడా దేశవ్యాప్తంగా ఇలాంటి సంబరాలే జరుగుతాయని ఈ విషయంలో గ్యారెంటీ ఇస్తున్న అంటూ... విజయ్ దేవరకొండ స్పందించారు.