బిచ్చగాడు-3 వచ్చే అవకాశం కూడా లేకపోలేదట

Vijay Antony opens up about when 'Pichaikkaran 3' will commence. విజయ్ ఆంటోని నటించిన 'బిచ్చగాడు 2' కి మంచి కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి.

By Medi Samrat
Published on : 22 May 2023 3:00 PM

బిచ్చగాడు-3 వచ్చే అవకాశం కూడా లేకపోలేదట

విజయ్ ఆంటోని నటించిన 'బిచ్చగాడు 2' కి మంచి కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఈ సినిమాతో విజయ్ ఆంటోనీ దర్శకుడిగా కూడా పరిచయమయ్యాడు. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా మిశ్రమ సమీక్షలను అధిగమించి బాక్సాఫీస్ విజేతగా నిలిచింది. ఈ సినిమా విజయ్ ఆంటోనీ కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్స్‌ అందుకుంది విజయ్‌ ఆంటోని ఫిల్మ్‌ కార్పొరేషన్‌ అధికారికంగా ప్రకటించింది. విజయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన విజయ్ ఆంటోనీ ప్రెస్‌తో మాట్లాడుతూ 'బిచ్చగాడు 3' ఖచ్చితంగా 2025లో మీ ముందుకు వస్తుందని.. తానే దర్శకత్వం వహించవచ్చని కూడా పేర్కొన్నాడు. ఇంత పెద్ద విజయాలు అందించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. 3 రోజుల్లో ఈ సినిమా 9.5 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో విజయ్ ఆంటోని సరసన కావ్య థాపర్ కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో రాధా రవి, వై జీ మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ పెరడి, జాన్ విజయ్, దేవ్ గిల్, యోగి బాబు కీలక పాత్రల్లో నటించారు. 2016 వచ్చిన బిచ్చగాడు 1 కు భిన్నమైన సబ్జెక్ట్‌తో బిచ్చగాడు 2 వచ్చింది.


Next Story