ర‌ణవీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ పై ఆ హీరోయిన్ ఏమి చెప్పిందో తెలుసా..?

Vidya Balan Supports Ranveer Singh. ఒక మ్యాగజైన్ కోసం రణవీర్ సింగ్ తన న్యూడ్ ఫోటోషూట్ గురించి మాట్లాడారు

By Medi Samrat  Published on  29 July 2022 9:15 PM IST
ర‌ణవీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ పై ఆ హీరోయిన్ ఏమి చెప్పిందో తెలుసా..?

ఒక మ్యాగజైన్ కోసం రణవీర్ సింగ్ తన న్యూడ్ ఫోటోషూట్ గురించి మాట్లాడారు విద్యాబాలన్. రణవీర్ ఇటీవలి ఫోటోషూట్ గురించి మాట్లాడిన ఆమె మాట్లాడుతూ.. చాలా స్పోర్టివ్ గా సమాధానం చెప్పింది. తొలిసారిగా నగ్నంగా పోజులిచ్చిన బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ఫోటోలను ఆస్వాదించనివ్వండని ఆమె నవ్వుతూ చెప్పుకొచ్చింది. రణ్‌వీర్‌పై ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేశారో తనకు అర్థం కావడం లేదని విద్యా బాలన్ చెప్పింది.

"సమస్య ఏమిటి? ఒక వ్యక్తి ఇలా చేయడం మొదటిసారి కాదు కదా. మనం కూడా ఆనందించాలి. (క్యా ప్రాబ్లెమ్ హై? పెహ్లీ బార్ కోయి ఆద్మీ కర్ రహా హై. హమ్ లోగో కో భీ ఆంఖేన్ సేఖ్ ​​లేనే దీజియే నా)" అని ముంబైలో జరిగిన ఒక ఈవెంట్‌లో భాగంగా విద్యా విలేకరులతో చెప్పుకొచ్చారు. రణ్‌వీర్ మహిళల మనోభావాలను దెబ్బతీశాడని ముంబైలో ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే. "ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన వ్యక్తులుకు పెద్దగా పని లేకపోవచ్చు, అందుకే వారు ఈ విషయాలపై తమ సమయాన్ని వృథా చేస్తున్నారు. మీకు నచ్చకపోతే, పేపర్ మూసివేయండి లేదా విసిరేయండి, మీరు కోరుకున్నది చేయండి. ఎఫ్‌ఐఆర్‌లో ఎందుకు నమోదు చేయాలి?'' అని విద్యా ప్రశ్నించారు. గత కొన్ని రోజులుగా పలువురు రణవీర్‌కు మద్దతుగా నిలిచారు. ఈ విషయంపై రణ్‌వీర్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.










Next Story