థియేటర్లో ఆడియన్స్ ను షాక్ కు గురిచేసిన స్టార్ హీరో

విక్కీ కౌశల్, త్రిప్తి దిమ్రీ నటించిన 'Bad Newz' సినిమా జూలై 19న థియేటర్లలోకి వచ్చింది.

By Medi Samrat  Published on  21 July 2024 9:30 PM IST
థియేటర్లో ఆడియన్స్ ను షాక్ కు గురిచేసిన స్టార్ హీరో

విక్కీ కౌశల్, త్రిప్తి దిమ్రీ నటించిన 'Bad Newz' సినిమా జూలై 19న థియేటర్లలోకి వచ్చింది. శనివారం సినిమా ముగిసిన తర్వాత హీరో విక్కీ కౌశల్ ముంబై థియేటర్‌లో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. నగరంలో భారీ వర్షం పడుతున్నా కూడా సినిమాను వీక్షించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపాడు. అందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలలో విక్కీ కౌశల్ షేర్ చేశారు.

'బాడ్ న్యూజ్' నటుడు ప్రేక్షకులతో కలిసి 'తౌబా తౌబా' పాటను పాడడం కూడా ఆ వీడియోలో చూడవచ్చు. వారిలో కొందరితో ఫోటోలు కూడా దిగాడు. నటుడు విక్కీ కౌశల్‌కు కెరీర్ లో 'బ్యాడ్ న్యూజ్' సినిమా మంచి హిట్ గా నిలిచింది. రొమాంటిక్-కామెడీ జులై 19, శుక్రవారం నాడు రూ. 8.3 కోట్లు వసూలు చేయడం ద్వారా టిక్కెట్ కౌంటర్లలో మంచి ప్రదర్శన చేసింది. శని, ఆదివారాల్లో మంచి వృద్ధిని సాధించింది. ఆనంద్ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమ్మీ విర్క్, త్రిప్తి డిమ్రీ, షీబా చద్దా కూడా నటించారు.

Next Story