కత్రినా ఎక్కడ?.. షూటింగ్‌కు వెళ్తున్న విక్కీకి నెటిజన్ల ప్రశ్నలు
Vicky Kaushal Returns To Work After Wedding. నటుడు విక్కీ కౌశల్ డిసెంబర్ 9న డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని
By Medi Samrat Published on
18 Dec 2021 5:54 AM GMT

నటుడు విక్కీ కౌశల్ డిసెంబర్ 9న డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని ఫోర్ట్ బర్వారా సిక్స్ సెన్సెస్ రిసార్ట్‌లో కత్రినా కైఫ్‌ను వివాహమాడిన విషయం తెలిసిందే. అయితే.. పెళ్లైన తొమ్మిది రోజులకే ఈ కొత్త జంట ఎవరి పనులలోకి వారు వెళ్లినట్లు తెలుస్తోంది. విక్కీ కౌశల్ ఈ ఉదయం షూటింగ్ లో పాల్గొనేందుకు వెళ్లాడు. ఈ మేరకు ఉదయాన్నే కారు డ్రైవ్ చేస్తూ దిగిన సెల్ఫీని తన ఇన్‌స్టా గ్రాం అకౌంట్‌లో షేర్ చేశాడు. మొదట 'టీ' తర్వాత 'షూటింగ్' అంటూ ఫోటోకు క్యాప్షన్ కూడా రాశాడు.
ఫోటోలో నల్లటి హూడీ ధరించిన విక్కీ కౌశల్.. బ్లాక్ స్పెడ్స్ , బ్లాక్ క్యాప్‌తో దర్శనమిచ్చాడు. శనివారం ఉదయం విక్కీ కౌశల్ ఫోటోను షేర్ చేసిన వెంటనే.. అతని అభిమానులు "కత్రినా కైఫ్ ఎక్కడ?" అంటూ ప్రశ్నలతో ముంచెత్తారు. దయచేసి కత్రినా కైఫ్‌తో ఉన్న ఫోటో పోస్ట్ చేయండి అంటూ కౌశల్ ను రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇదిలావుంటే.. రెండు రోజుల క్రితమే కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ముంబైకి తిరిగి వచ్చారు. కలీనా విమానాశ్రయంలో నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ జంట.
Next Story