మరో విషాదం.. సీనియర్ నటుడు క‌న్నుమూత‌

Veteran actor Shivaram passes away. కన్నడ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. బెంగళూరులోని తన నివాసంలో

By Medi Samrat  Published on  5 Dec 2021 3:03 PM IST
మరో విషాదం.. సీనియర్ నటుడు క‌న్నుమూత‌

కన్నడ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. బెంగళూరులోని తన నివాసంలో మంగళవారం రాత్రి కుప్పకూలిపోయి ఆస్పత్రిలో చేరిన సీనియర్ నటుడు శివరామ్ శనివారం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 84. ఆరు దశాబ్దాల పాటు సాగిన తన కెరీర్‌లో, శివరామ్ రాజ్‌కుమార్, విష్ణువర్ధన్ మరియు అంబరీష్ వంటి దిగ్గజ నటులతో నటించారు. అతను దర్శకుడిగానూ, నిర్మాత గానూ వ్యవహరించారు. శరపంజర, నాగరాహువు, నేనోబ్బ కాళ్ల, యజమాన, అపత్మీరా స్నేహదా సేడు, నరఘోలే, గీత, హోంబిసిలు లాంటి మరెన్నో చెప్పుకోదగ్గ చిత్రాలలో నటించారు. సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఆయన రాణించారు. గెజ్జె పూజ, ఉపాసనే వంటి చిత్రాలను నిర్మించారు. హృదయ సంగమ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఇంట్లో పూజా చేస్తుండగా శివరామ్ కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో తలకు గాయమైంది. ఆస్పత్రికి తీసుకెళ్లగా, బ్రెయిన్​లో బ్లీడింగ్​ అయినట్లు తేలింది. ఆయన వయసు కారణంగా వైద్యులు శస్త్రచికిత్స చేయలేకపోయారు. గత రెండు రోజులుగా ఆయనకు చికిత్స అందిస్తున్నప్పటికీ, శివరామ్​ను డాక్టర్లు బతికించలేకపోయారు. దాదాపు ఆరు దశాబ్దాల సినీ కెరీర్ లో కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా, హాస్య నటుడిగా, సహాయ నటుడిగా ఎన్నో పాత్రలు పోషించారు. 1965 సినిమాలో 'బేరత జీవా' సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. 90కి పైగా సినిమాల్లో నటించారు. తన సోదరుడు ఎస్.రామనాథన్​తో కలిసి పలు సినిమాలను నిర్మించారు శివరామ్. 1985లో వచ్చిన బాలీవుడ్ మూవీ 'గిరఫ్తార్' నిర్మించింది ఈయనే. ఇందులో ముగ్గురు స్టార్ హీరోలు అమితాబ్ బచ్చన్, కమల్​హాసన్, రజనీకాంత్ కలిసి నటించడం విశేషం. 2010-11 ఏడాదికిగాను డాక్టర్.రాజ్​కుమార్ లైఫ్​టైమ్ అచీవ్​మెంట్​ అవార్డును కర్ణాటక ప్రభుత్వం శివరామ్​కు బహుకరించింది. శివరామ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.


Next Story