ప్రముఖ టీవీ నటి కేతకీ దవే భర్త రసిక్ దవే కన్నుమూశారు. శుక్రవారం జూలై 29న.. 65 సంవత్సరాల వయస్సులో మూత్రపిండాల వైఫల్యం కారణంగా ఆయన కన్నుమూశారు. గత రెండేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటున్నారు. క్యుంకీ సాస్ భీ కభీ బహు థీలో దక్ష అనే పాత్రతో కేతకీ పాపులారిటీని సంపాదించారు. టెలివిజన్ రంగంలో రాణిస్తున్న రసిక్ దవేను ఆమె వివాహం చేసుకుంది.
రసిక్ తన కెరీర్ను 1982లో గుజరాతీ చిత్రం పుత్ర వధు చిత్రం ద్వారా ప్రారంభించాడు. ఆ తర్వాత గుజరాతీ, హిందీ భాషల్లో పనిచేశారు. రసిక్, కేతకీ కలిసి గుజరాతీ థియేటర్ కంపెనీని ప్రారంభించారు. 2006లో నాచ్ బలియేలో కూడా పాల్గొన్నారు. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.