ప్రముఖ నటుడు శివాజీ కన్నుమూత
ప్రముఖ హాస్యనటుడు RS శివాజీ కన్నుమూశారు. సెప్టెంబర్ 2, 2023, శనివారం ఉదయం
By Medi Samrat Published on 2 Sept 2023 6:18 PM ISTప్రముఖ హాస్యనటుడు RS శివాజీ కన్నుమూశారు. సెప్టెంబర్ 2, 2023, శనివారం ఉదయం చెన్నైలో ఆయన మరణించారు. తమిళ సినిమాల్లో ఆయన పనిచేశారు. శివాజీకి 66 ఏళ్లు. నటుడు కమల్ హాసన్ కు అత్యంత సన్నిహితుడు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌తో శివాజీ బలమైన సహకారాన్ని కలిగి ఉన్నాడు. నటనతో పాటు, శివాజీ అసిస్టెంట్ డైరెక్టర్ గానూ, సౌండ్ డిజైన్ విభాగంలోనూ, పలు తమిళ చిత్రాలకు లైన్ ప్రొడక్షన్ లో కూడా సహకారం అందించారు.
ఆర్ఎస్ శివాజీ అనారోగ్య సమస్యలతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. తమిళంలో వందకుపైగా సినిమాల్లో నటించారు ఆర్ఎస్ శివాజీ. కమల్‌హాసన్ హీరోగా నటించిన విక్రమ్, సత్య, అపూర్వ సగోదరగళ్, మైఖేల్ మదన కామరాజు, గుణ, చాచి 420, అన్బేశివంతో పాటు పలు సినిమాల్లో శివాజీ కామెడీ ప్రధాన పాత్రల్లో నటించారు. చిరంజీవి జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాతో తెలుగు వారికి కూడా పరిచయమయ్యారు ఆర్ఎస్ శివాజీ. మాలోకం అనే కానిస్టేబుల్ పాత్రలో నవ్వులు పూయించారు. తేజ దర్శకత్వంలో రూపొందిన 1000 అబద్దాలు సినిమాలో శివాజీ కీలక పాత్రలో కనిపించారు. గత ఏడాది సాయిపల్లవి హీరోయిన్‌గా తె