హీరో సూర్య నటించిన రెట్రో మూవీ ఆడియో ఫంక్షన్ లో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. గిరిజన సంఘాల ఫిర్యాదుతో విజయ్ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసులో విజయ్ దేవర కొండ పిటిషన్ పై తీర్పు వాయిదా వేసింది హైకోర్టు. తనపై నమోదైన కేసును కొట్టేయాలని విజయ్ దేవరకొండ హైకోర్టు లో పిటిషన్ వేశారు. ఈ కేసులో జులై 31న వాదనలు పూర్తయ్యాయి.
విజయ్ దేవరకొండ సామాజిక మాధ్యమాల్లో క్షమాపణ చెప్పారని ఆయన తరపున న్యాయవాది వాదనల సందర్భంగా హైకోర్టుకు తెలిపారు. సోషియల్ మీడియా లో చెప్పిన క్షమాపణలు పరిగణలోకి తీసుకోకూడదని ప్రతివాదుల తరుపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు ముగియడంతో తీర్పు వాయిదా వేసింది న్యాయస్థానం.