‘వెన్నెల’ కిషోర్ కథానాయకుడిగా ‘చారి 111’

ప్రముఖ హాస్యనటుడు ‘వెన్నెల’ కిషోర్ కథానాయకుడిగా కొత్త సినిమా రాబోతోంది.

By Medi Samrat  Published on  23 Aug 2023 9:15 PM IST
‘వెన్నెల’ కిషోర్ కథానాయకుడిగా ‘చారి 111’

ప్రముఖ హాస్యనటుడు ‘వెన్నెల’ కిషోర్ కథానాయకుడిగా కొత్త సినిమా రాబోతోంది. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్న సినిమాకు ‘చారి 111’ అనే పేరు పెట్టారు. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. సుమంత్ హీరోగా నటించిన హిట్ సినిమా ‘మళ్ళీ మొదలైంది’ తర్వాత కీర్తికుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో ‘వెన్నెల’ కిషోర్ సరసన సంయుక్తా విశ్వనాథన్ కథానాయికగా నటించనుంది. మురళీ శర్మ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ ను కూడా విడుదల చేశారు. చారి 111’ గురించి చిత్ర దర్శకుడు టీజీ కీర్తి కుమార్ మాట్లాడుతూ.. ‘ఇదొక యాక్షన్ కామెడీ సినిమా. ఇందులో వెన్నెల కిషోర్ గూఢచారి పాత్రలో కనిపిస్తారు. ఓ సిటీలో జరిగే అనుమానాస్పద ఘటనలను ఛేదించే రహస్య గూఢచారి పాత్రలో ఆయన లుక్ స్టైలిష్‌గా ఉంటుంది. అలాగే, ఆ పాత్రలో ఓ కన్‌ఫ్యూజన్ ఉంటుందని అన్నారు. ఈ సినిమాలో బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రవీంద్రన్, పావని రెడ్డి, తాగుబోతు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సైమన్ కె కింగ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకు కషిష్ గ్రోవర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రిచర్డ్ కెవిన్ ఎ ఎడిటర్. గతంలో వెన్నెల కిషోర్ హీరోగా చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఈ సినిమా అయినా వెన్నెల కిషోర్ కు హీరోగా సక్సెస్ ను అందిస్తుందేమో చూడాలి.

Next Story