తన లవ్‌స్టోరీ ఎప్పుడు మొదలైందో చెప్పిన వరుణ్ తేజ్
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటీవల నిశ్చితార్థం చేసుకోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.
By Medi Samrat Published on 18 Aug 2023 6:41 PM ISTవరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటీవల నిశ్చితార్థం చేసుకోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఈ టాలీవుడ్ జంట గురించి ఎన్నో విషయాలను తెలుసుకోవాలని మెగా అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ జంట మిస్టర్, అంతరిక్షం వంటి చిత్రాలలో కలిసి పనిచేశారు. సినిమా సెట్స్‌లోనే ఈ జంట మధ్య ప్రేమ చిగురించిందని ఎంతో మంది ఊహించారు. తాజాగా వరుణ్ తేజ్ ఈ విషయాలను బయటపెట్టాడు.
తన తదుపరి చిత్రం 'గందీవధారి అర్జున' విడుదల కోసం ఎదురుచూస్తున్న వరుణ్ తేజ్.. తమ లవ్ స్టోరీ గురించి చెప్పేశాడు. "చాలా ఆర్గానిక్ గా తమ మధ్య ప్రేమ మొదలైందని అన్నారు. మేము మొదట "మిస్టర్" చిత్రానికి కలిసి పని చేసాము. ఆ సమయంలో మంచి స్నేహితులం అయ్యాము. అంతరిక్షం సినిమా షూటింగ్‌కి ముందే అది ప్రేమగా మారింది. నేను ప్రైవేట్ వ్యక్తిని.. నా తల్లిదండ్రులకు దాని గురించి తెలుసు. మా నిశ్చితార్థం గురించి ప్రకటించే వరకు అది అలాగే కొనసాగింది, ”అని వరుణ్ తేజ్ అన్నారు. ఈ ఏడాది చివర్లో గ్రాండ్‌గా పెళ్లి చేసుకోనున్నట్లు కూడా బయటపెట్టాడు వరుణ్ తేజ్. “ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్‌లో పెళ్లి తేదీ కోసం చూస్తున్నాం. నేను హైదరాబాద్‌లో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అయితే ఇది ప్రైవేట్ వ్యవహారం కావడంతో అది సాధ్యం కాదు. డెస్టినేషన్ వెడ్డింగ్‌గా చేసుకోనున్నాం. కొన్ని లొకేషన్స్ గురించి అనుకుంటూ ఉన్నామని.. త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటాం" అని అన్నారు.