సింపుల్ గా వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం

Varun Tej and Lavanya Tripathi get engaged. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్యల నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది.

By Medi Samrat  Published on  10 Jun 2023 3:21 AM GMT
సింపుల్ గా వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్యల నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. గతకొన్నేళ్లుగా ప్రేమలో ఉంటున్న ఈ జంట త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఎంగేజ్‌మెంట్ శుక్రవారం సాయంత్రం నాగబాబు ఇంట్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తుంది. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, లావణ్య త్రిపాఠి ఫ్యామిలీలు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యాయి. వీరి పెళ్లి ఈ ఏడాది చివర్లో జరుగనున్నట్లు తెలుస్తుంది. మిస్టర్ సినిమాలో తొలిసారి వరుణ్, లావణ్యలు కలిసి నటించారు. ఈ సినిమాతోనే వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ మరుసటి ఏడాది అంతరిక్షం సినిమాలో మరోసారి వీరిద్దరూ కలిసి నటించారు. అప్పటి నుంచి వీళ్ల స్నేహం కాస్త ప్రేమగా మారిందని తెలుస్తుంది. ఎంతో కాలంగా వీరిద్దరూ వాళ్ల ప్రేమను గోప్యంగానే ఉంచుతూ వచ్చారు. వీళ్ల రిలేషన్ పై ఎన్ని వార్తలు వచ్చిన వీరిద్దరూ ఎప్పుడూ వాటిపై స్పందించలేదు.

వరుణ్ తేజ్ ప్రస్తుతం గాండీవధారి అర్జున సినిమా చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాక్షీ వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. లావణ్య త్రిపాఠి ఇటీవలే పులిమేక వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జీ-5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ కు మంచి స్పందన వచ్చింది. గతేడాది హ్యపీ బర్త్ డే సినిమాతో అలరించింది.


Next Story