అవును.. సమంతను కొట్టాల్సి వచ్చింది: ఒప్పుకున్న బాలీవుడ్ హీరో

సమంత రూత్ ప్రభు చాలా గ్యాప్ తర్వాత నటించిన టీవీ షో 'సిటాడెల్: హనీ బన్నీ'. ఈ షో ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తూ వస్తున్నారు

By Medi Samrat  Published on  1 Aug 2024 9:00 PM IST
అవును.. సమంతను కొట్టాల్సి వచ్చింది: ఒప్పుకున్న బాలీవుడ్ హీరో

సమంత రూత్ ప్రభు చాలా గ్యాప్ తర్వాత నటించిన టీవీ షో 'సిటాడెల్: హనీ బన్నీ'. ఈ షో ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తూ వస్తున్నారు. ముంబైలో గురువారం జరిగిన సిటాడెల్: హనీ బన్నీ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత రూత్ ప్రభుని తాను కొట్టిన విషయాన్ని ఈ సిరీస్ లో లీడ్ రోల్ చేసిన బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ బయట పెట్టాడు.

ప్రెస్ కాన్ఫరెన్స్ లో వరుణ్ మాట్లాడుతూ.. ఓ సన్నివేశంలో భాగంగా సమంతను కొట్టాల్సి వచ్చిందని అయినా కూడా సమంత ఏ మాత్రం జంకలేదని తెలిపాడు. ‘నన్ను కొట్టండి.. కొట్టండి’ అంటూ సమంత ముందుకు వచ్చేదని.. షోలో భాగంగా రకరకాల దెబ్బలు తిన్నామని తెలిపాడు. షూటింగ్ సమయంలో ఆమె అనారోగ్యం పాలైందని, ఆమె తెగువను వరుణ్ ధావన్ ప్రశంసించాడు. నిజాయితీగా చెప్పాలంటే, సమంతతో పోలిస్తే నా ప్రిపరేషన్ చాలా సులభం.. ఆమె షోలో చేరినప్పుడు ఆమె ఏం పోరాడుతోందో అందరికీ తెలుసన్నాడు. నా రిహార్సల్స్ చాలా కష్టమని నేను అనుకున్నాను.. కానీ ఆమె కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఆమె అద్భుతమైన వర్క్ ఎథిక్స్ ను నేను చూశాను.. అది నాకు నిజంగా స్ఫూర్తినిచ్చిందని వరుణ్ తెలిపాడు.

Next Story