తెలుగు హీరోలకి వరంలా మారిన వరలక్ష్మి శరత్ కుమార్.!
Varalaxmi Sarathkumar Lucky Heroin For Telugu Heros. సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురుగా ఇండస్ట్రీ కి యాక్టర్ గా పరిచయమైన వరలక్ష్మి శరత్ కుమార్
By Medi SamratPublished on : 22 Feb 2021 9:31 PM IST

ప్రముఖ సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురుగా ఇండస్ట్రీ కి యాక్టర్ గా పరిచయమైన వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అనేక సినిమాలలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈమె మన తెలుగు ప్లాప్ హీరోలకి వరంలా మారింది.. ఎందుకంటే.. రవితేజ, అల్లరి నరేష్ చాలా ప్లాపులు ఎదురుకున్నారు. దాదాపు ఈ ఇద్దరి హీరోల పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో ఎట్టకేలకు 2021 లో వాళ్ళు సాలిడ్ కొట్టి కంబ్యాక్ ఇచ్చారు. రవితేజ 'క్రాక్' తో అలాగే అల్లరి నరేష్ 'నాంది' తో హిట్లు అందుకున్నారు. అయితే ఈ రెండు సినిమాల్లోనూ నటి వరలక్ష్మీ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. దాంతో 'ప్లాప్ హీరోలకు హిట్లిచ్చే దేవతగా ఇంకా గోల్డెన్ లెగ్ గా మారిపోయింది వరలక్ష్మీ' అంటూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఈమె కెరీర్ ప్రారంభం నుండీ తమిళంలో హీరోయిన్ గా కంటే ఎక్కువగా విలన్ రోల్స్ అలాగే నెగిటివ్ రోల్స్ ను పోషిస్తూ వస్తోంది. కానీ అక్కడ ఈమె నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు.కానీ తెలుగులో మాత్రం ఈమెకు మంచి గుర్తింపు దక్కుతుంది. 'పందెం కోడి2' 'సర్కార్' వంటివి డబ్బింగ్ సినిమాలే అయినప్పటికీ.. అవి అక్కడ కంటే తెలుగులోనే హిట్ అయ్యాయి. ఆ రెండు చిత్రాల్లోనూ వరలక్ష్మీ పాత్ర హైలెట్ గా నిలుస్తుంటుంది.' 9 ఏళ్లుగా కోలీవుడ్లో వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ.. అక్కడ రాని గుర్తింపు తెలుగులో దక్కింది.ఇక్కడి ప్రేక్షకులు నన్ను బాగా ఆదరిస్తున్నారు.
తమిళంలో కంటే తెలుగులోనే మంచి కథా ప్రాధాన్యత ఉన్న సినిమాలు నాకు దక్కుతున్నాయి' అంటూ ఇటీవల 'నాంది' సక్సెస్ మీట్లో వరలక్ష్మీ చెప్పుకొచ్చింది. తెలుగులో ఈమెకు మరిన్ని ఆఫర్లు కూడా దక్కుతున్నట్టు సమాచారం తెలుస్తుంది.
Next Story