పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ గా నటించి ఆకట్టుకున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమ పింక్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నివేద థామస్, అంజలీ, అనన్య నటించారు. దాదాపు మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ తెరపై కనిపించడంతో అభిమానులు థియేటర్ల ముందు రచ్చ చేస్తున్నారు.
మరో వైపు వకీల్ సాబ్ సినిమా టికెట్ల రేట్లపై ఏపీలో వివాదం నడుస్తూ ఉంది. వకీల్ సాబ్ సినిమా టికెట్ల విషయంలో రాద్ధాంతం జరుగుతూ ఉంది. ప్రభుత్వం కావాలనే ఈ పని చేసిందా అనే కథనాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. వకీల్ సాబ్ టికెట్ రేట్లు పెంచుకోవచ్చంటూ ఉత్తర్వులు ఇచ్చిన సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఏపీలో వకీల్ సాబ్ సినిమా టికెట్ రేట్లను పెంచొద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈ నిర్ణయం ఇప్పటికే ఆన్ లైన్ లో ఆదివారం వరకు బుక్ అయిన టికెట్లకు వర్తించదని పేర్కొంది.
బెనిఫిట్ షోలు ప్రదర్శించరాదని, టికెట్ రేట్లు పెంచవద్దని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే..! టికెట్ రేట్లు పెంచితే కఠినచర్యలు తప్పవంటూ ఓ జీవో కూడా తీసుకురావడంతో వకీల్ సాబ్ డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ బెంచ్ మూడ్రోజుల పాటు టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో వకీల్ సాబ్ టికెట్ రేట్లు పెంచుకోవచ్చంటూ ఉత్తర్వులు ఇచ్చిన సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది.