వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో ఫ్యాన్స్ కు షాక్.. దిల్ రాజు ఏమి చేస్తాడో..?

Vakeel Saab Pre-Release Event . 'వకీల్‌సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హైదరాబాద్, జూబ్లీహిల్స్ పోలీసులు అనుమతి నిరాకరించారు

By Medi Samrat  Published on  31 March 2021 8:05 AM GMT
Vakeel Saab Pre-Release Event

పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత వెండితెరపై కనిపిస్తున్న సినిమా 'వకీల్ సాబ్'. ఈ సినిమా మీద అంచనాలను ట్రైలర్ భారీగా పెంచేసింది. ఇక ప్రమోషన్స్ విషయంలో కూడా పెద్ద ప్లానింగ్ ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో భారీ స్థాయిలో నిర్వహించాలని చిత్ర యూనిట్ భావించగా.. హైదరాబాద్ పోలీసులు వారి ఆశలపై నీళ్లు జల్లారు.

'వకీల్‌సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హైదరాబాద్, జూబ్లీహిల్స్ పోలీసులు అనుమతి నిరాకరించారు. జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖరరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. యూసుఫ్‌గూడలోని పోలీస్ లైన్స్‌లోని స్పోర్ట్స్ గ్రౌండ్స్‌లో ఏప్రిల్ 3న పవన్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించాలని భావిస్తూ అనుమతి కోసం జె.మీడియా పోలీసులకు లేఖ రాసింది. ఈ ఫంక్షన్‌కు 5 నుంచి 6 వేల మంది హాజరవుతారని ఆ లేఖలో నిర్వాహకులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా మళ్లీ చెలరేగుతున్న నేపథ్యంలో సభలు, సమావేశాలకు అనుమతులు లేవని చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో 'వకీల్‌సాబ్' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పోలీసులు అనుమతి నిరాకరించడంతో పవన్ అభిమానులు నిరాశలో మునిగిపోయారు. నిర్మాత దిల్ రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్ పై త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

ఇదిలావుంటే.. దాదాపు మూడేళ్ల విరామం త‌రువాత ప‌వ‌న్ నటిస్తున్న చిత్రం కావ‌డంతో వ‌కీల్ సాబ్‌పై అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. బాలీవుడ్ పింక్ చిత్రానికి రీమేక్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్ర ట్రైల‌ర్‌ను సోమ‌వారం విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ ట్రైల‌ర్ రికార్డు వ్యూస్‌ల‌తో దూసుకెలుతోంది. ట్రైల‌ర్‌లో ప‌వ‌న్ డైలాగ్‌లు అభిమానుల‌ను అల‌రిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల‌ను ట్రైల‌ర్‌తో రెట్టింపు అయ్యాయి.

Next Story