అక్కడ శవమై కనిపించిన.. ప్రముఖ హాలీవుడ్‌ నటి లిండ్సే పెర్ల్‌మాన్‌

US TV actress Lindsey Pearlman found dead. హాలీవుడ్ నటి లిండ్సే ఎరిన్ పెర్ల్‌మాన్ లాస్ ఏంజిల్స్‌లో కనిపించకుండా పోయిన కొద్ది రోజులకే ఆమె మృతదేహాం లభ్యమైం

By అంజి  Published on  20 Feb 2022 2:04 PM IST
అక్కడ శవమై కనిపించిన.. ప్రముఖ హాలీవుడ్‌ నటి లిండ్సే పెర్ల్‌మాన్‌

హాలీవుడ్ నటి లిండ్సే ఎరిన్ పెర్ల్‌మాన్ లాస్ ఏంజిల్స్‌లో కనిపించకుండా పోయిన కొద్ది రోజులకే ఆమె మృతదేహాం లభ్యమైంది. ఆమె వయస్సు 43 సంవత్సరాలు. లిండ్సే జనరల్ హాస్పిటల్, అమెరికన్ హౌస్‌వైఫ్, అనేక ఇతర టీవీ కార్యక్రమాలతో ప్రసిద్ధి చెందింది. రిపోర్ట్‌ ప్రకారం.. నటి లిండ్సే తప్పిపోయిన తర్వాత ఆమెను కనుగొనడంలో అధికారులు ప్రజల సహాయాన్ని కోరారు. ఆమె చివరిసారిగా వారం క్రితం మధ్యాహ్నం కనిపించింది. ఫిబ్రవరి 18 ఉదయం హాలీవుడ్‌లోని నివాస పరిసరాల్లో లిండ్సే ఎరిన్ మృతదేహం కనుగొనబడింది. మృతదేహాం లిండ్సేదే అని లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తరువాత నిర్ధారించింది. మృతికి గల కారణాలు, ఆమె అదృశ్యానికి గల కారణాలు ప్రస్తుతం విచారణలో ఉన్నాయి.

నటి లిండ్సే భర్త వాన్స్ స్మిత్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె మృతి సంబంధించిన విషయాన్ని పోస్టు చేశారు. "పోలీసులు లిండ్సేని కనుగొన్నారు. ఆమె మన నుండి దూరంగా వెళ్లిపోయింది. తాను తర్వాత మరిన్ని విషయాలు పంచుకుంటాను. ప్రతి ఒక్కరి ప్రేమ, ప్రయత్నాలకు ధన్యవాదాలు. ఈ సమయంలో ఆమె కుటుంబం యొక్క గోప్యతను గౌరవించవలసిందిగా కోరుతున్నాను." అని చెప్పారు. ఫిబ్రవరి 13న లిండ్సే తప్పిపోయినప్పుడు, ఆమె కజిన్ సవన్నా పెర్ల్‌మాన్ ట్విట్టర్‌లోకి వెళ్లి.. ఆమెను గుర్తించడానికి వ్యక్తుల నుండి సహాయం కోరుతూ ఆమె ట్వీట్ చేసింది. "లాస్‌ ఏంజిల్స్‌ ప్రజలు.. నా కజిన్ లిండ్సే పెర్ల్‌మాన్ తప్పిపోయారు. ఆమె ఫోన్ చివరిగా సన్‌సెట్ బీవీడీలో పింగ్ చేయబడింది. అని పేర్కొంది. లిండ్సే ది పర్జ్, చికాగో జస్టిస్‌లో తన పాత్రతో బాగా ప్రసిద్ది చెందింది.


Next Story